కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 15-21

యోబు 36-37

జనవరి 15-21

పాట 147, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. శాశ్వత జీవితం గురించి దేవుడిచ్చిన మాటను ఎందుకు నమ్మవచ్చు?

(10 నిమి.)

యెహోవా శాశ్వతకాలం ఉంటాడు (యోబు 36:26; wp16.1 13వ పేజీ, 1-2 పేరాలు)

మనుషులు బ్రతకడానికి కావాల్సినవన్నీ ఇచ్చే తెలివి, శక్తి యెహోవాకు ఉన్నాయి (యోబు 36:27, 28; w20.05 22వ పేజీ, 6వ పేరా)

శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలో యెహోవా మనకు నేర్పిస్తున్నాడు (యోబు 36:4, 22; యోహా 17:3)


శాశ్వత జీవితం ఇస్తాననే దేవుని మాట మీద గట్టి విశ్వాసం ఉంటే, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా స్థిరంగా ఉంటాం.—హెబ్రీ 6:19; w22.10 28వ పేజీ, 16వ పేరా.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యోబు 37:20—అప్పట్లో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వార్త లేదా సమాచారం ఎలా చేరేది? (it-1-E 492వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. (lmd 3వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd 2వ పాఠంలో 5వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రసంగం. ijwfg 57, 5-15 పేరాలు—అంశం: మారణహోమం లేదా హోలోకాస్ట్‌ సమయంలో యెహోవాసాక్షుల్ని ఎందుకు హింసించారు? (th 18వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 49

7. వైద్య చికిత్స లేదా సర్జరీ చేయించుకునే పరిస్థితి రాకముందే సిద్ధపడండి

(15 నిమి.) చర్చ. ఒక పెద్ద చేయాలి.

రక్తం విషయంలో దేవుడు పెట్టిన నియమానికి మనం లోబడతాం. ఈ విషయంలో మనకు సహాయం చేయడానికి యెహోవా సంస్థ కొన్ని పనిముట్లు ఇచ్చింది. (అపొ 15:28, 29) వాటిని మీరు బాగా ఉపయోగించుకుంటున్నారా?

డిపిఎ (DPA) కార్డు, ఐడెంటిటీ కార్డు (ic): రక్తం విషయంలో రోగి ఇష్టాయిష్టాలు ఏంటో ఈ కార్డులు వివరిస్తాయి. బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులు తమ కోసం డిపిఎ కార్డుని, తమ మైనరు పిల్లల కోసం ఐడెంటిటీ కార్డుని లిటరేచర్‌ సర్వెంట్‌ దగ్గర తీసుకోవచ్చు. ఈ కార్డులను ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవాలి. వాటిని నింపడానికి లేదా అప్‌డేట్‌ చేయడానికి అస్సలు ఆలస్యం చేయకండి.

తల్లులు కాబోయేవారి కోసం సమాచారం (S-401), సర్జరీ లేదా కీమోథెరపీ అవసరమైన రోగులకు సమాచారం (S-407): వైద్య చికిత్స విషయంలో, మరిముఖ్యంగా రక్తం విషయంలో పరిస్థితి చేయిదాటిపోకముందే జాగ్రత్తపడడానికి ఈ డాక్యుమెంట్లు మనకు సహాయం చేస్తాయి. గర్భిణీలు, సర్జరీ అవసరమైన వాళ్లు, లేదా క్యాన్సర్‌కి చికిత్స చేయించుకునే వాళ్లు తమకు తగిన డాక్యుమెంట్‌ని సంఘపెద్దల దగ్గర అడిగి తీసుకోవచ్చు.

ఆసుపత్రి అనుసంధాన కమిటీ (HLC): HLCలో అర్హులైన పెద్దలు ఉంటారు. వాళ్లు అటు డాక్టర్లకు, ఇటు ప్రచారకులకు రక్తానికి సంబంధించిన విషయాల్లో సమాచారం అందించేలా శిక్షణ పొందారు. వాళ్లు మీ డాక్టరుతో, రక్తంలేని వైద్య చికిత్సల గురించి చెప్పగలుగుతారు. అవసరమైతే, మీ నిర్ణయాల్ని గౌరవించే ఒక డాక్టరును వెతకడంలో కూడా సహాయం చేస్తారు. వాళ్లు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. మీరు హాస్పిటల్లో చేరాల్సి వచ్చినా, సర్జరీ చేయించుకోవాల్సి వచ్చినా, లేదా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నా, వీటన్నిటికి అసలు రక్తంతో సంబంధం లేదనిపించినా, వీలైనంత త్వరగా HLC వాళ్లతో మాట్లాడండి. గర్భిణీల విషయంలో కూడా అంతే. సహాయం అవసరమైనప్పుడు, మీ సంఘపెద్దల దగ్గర HLC వాళ్ల వివరాలు అడిగి తీసుకోండి.

ఆసుపత్రి అనుసంధాన కమిటీలు మీకెలా సహాయం చేస్తాయి? అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

మీకు వైద్య చికిత్స లేదా సర్జరీ అవసరమైనప్పుడు HLC ఎలా సహాయం చేస్తుంది?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 67, ప్రార్థన