కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 22-28

యోబు 38-39

జనవరి 22-28

పాట 11, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. సృష్టిని చూడడానికి మీరు సమయం తీసుకుంటున్నారా?

(10 నిమి.)

భూమిని చేసిన తర్వాత, యెహోవా సమయం తీసుకుని తను చేసిందంతా ఒకసారి చూశాడు (ఆది 1:10, 12; యోబు 38:5, 6; w21.08 9వ పేజీ, 7వ పేరా)

యెహోవా చేసినవాటిని దేవదూతలు సమయం తీసుకుని చూశారు (యోబు 38:7; w20.08 14వ పేజీ, 2వ పేరా)

సృష్టిని చూడడానికి, ఆస్వాదించడానికి సమయం తీసుకుంటే యెహోవా మీద మనకు నమ్మకం పెరుగుతుంది (యోబు 38:32-35; w23.03 17వ పేజీ, 8వ పేరా)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యోబు 38:8-10—యెహోవాకున్న నియమాలు పెట్టే అధికారం గురించి ఈ వచనాలు ఏం చెప్తున్నాయి? (it-2-E 222వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) అనియత సాక్ష్యం. ఎదుటివ్యక్తికి మాట్లాడడం ఇష్టం లేదనిపిస్తే మంచిగా ముగించండి. (lmd 2వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(5 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంతకుముందు మాట్లాడినప్పుడు, ఇంటివ్యక్తి తనకు ఇష్టమైనవాళ్లను పోగొట్టుకున్నట్టు మీకు చెప్పాడు. (lmd 9వ పాఠంలో 3వ పాయింట్‌)

6. ప్రసంగం

(5 నిమి.) lmd అనుబంధం A, 1వ పాయింట్‌—అంశం: ప్రస్తుత సంఘటనల్ని, మనుషుల స్వభావాన్ని చూస్తే త్వరలోనే ఒక మార్పు రాబోతుందని అర్థమౌతుంది. (th 16వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 111

7. సృష్టిని చూడడం వల్ల మన సమస్యల్ని పక్కనపెడతాం

(15 నిమి.) చర్చ.

సాతాను యోబుకు ఎన్నో కష్టాలు తెచ్చాడు, యోబు ముగ్గురు స్నేహితులు సూటిపోటి మాటలతో ఆయన్ని దెప్పిపొడిచారు. ఆ సమయంలో యోబు తన సమస్యల మీదే మనసుపెట్టాడు.

యోబు 37:14 చదవండి. తర్వాత ఇలా అడగండి:

యోబు తన సమస్యల మీదే మనసుపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?

సమస్యలు ఊపిరాడకుండా చేసినప్పుడు, మనం సృష్టిని చూడాలి. అలా చేస్తే యెహోవా ఎంత గొప్పవాడో గుర్తొస్తుంది, ఆయనకు ఇంకా నమ్మకంగా ఉండాలనిపిస్తుంది, ఏం జరిగినా సరే ఆయన మనల్ని చూసుకుంటాడనే ధైర్యం వస్తుంది.—మత్త 6:26.

యోబు పుస్తకం నేర్పే పాఠాలు—జంతువుల్ని గమనించండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

యెహోవా మీద మీ నమ్మకాన్ని ఈ వీడియో ఎలా పెంచింది?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 54, ప్రార్థన