కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 29–ఫిబ్రవరి 4

యోబు 40-42

జనవరి 29–ఫిబ్రవరి 4

పాట 124, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. యోబు జీవితం నుండి నేర్చుకునే పాఠాలు

(10 నిమి.)

యెహోవా ఆలోచనలు మన ఆలోచనలకు మించి ఉంటాయని గుర్తుంచుకోండి (యోబు 42:1-3; w10 10⁄15 3-4 పేజీలు, 4-6 పేరాలు)

యెహోవా, ఆయన సంస్థ ఇచ్చే సలహాను వెంటనే పాటించండి (యోబు 42:5, 6; w17.06 25వ పేజీ, 12వ పేరా)

ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తనకు నమ్మకంగా ఉండేవాళ్లను యెహోవా దీవిస్తాడు (యోబు 42:10-12; యాకో 5:11; w22.06 25వ పేజీ, 17-18 పేరాలు)

యథార్థంగా ఉన్నందుకు యెహోవా యోబును దీవించాడు

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యోబు 42:7—యోబు ముగ్గురు స్నేహితులు నిజానికి ఎవరి గురించి తప్పుగా మాట్లాడారు? అది తెలుసుకోవడం వల్ల మనమెలా ఎగతాళిని తట్టుకోవచ్చు? (it-2-E 808వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి క్రైస్తవుడు కాదు. (lmd 5వ పాఠంలో 3వ పాయింట్‌)

5. శిష్యుల్ని చేసేటప్పుడు

6. ప్రసంగం

(4 నిమి.) lmd అనుబంధం A, 2వ పాయింట్‌—అంశం: భూమి ఎప్పటికీ నాశనం కాదు. (th 13వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 108

7. వేరేవాళ్లకు యెహోవా ప్రేమను రుచి చూపించండి

(15 నిమి.) చర్చ.

ప్రేమకు నిలువెత్తు రూపమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు సంతోషిస్తాం. (1యో 4:8, 16) యెహోవా చూపించే ప్రేమే మనల్ని ఆయన వైపు ఆకర్షిస్తుంది, ఆయన్ని అంటిపెట్టుకుని ఉండేలా కదిలిస్తుంది. యెహోవా సేవకులుగా మనందరం, ఆయన ప్రేమను ప్రతీరోజు రుచిచూస్తాం.

మనం ఇంట్లోవాళ్లతో, బ్రదర్స్‌-సిస్టర్స్‌తో, వేరేవాళ్లతో నడుచుకునే విధానంలో కూడా యెహోవాలా ప్రేమను పంచడానికి కృషిచేస్తాం. (యోబు 6:14; 1యో 4:11) మనం ప్రేమ చూపిస్తే, వేరేవాళ్లు యెహోవాను తెలుసుకుని ఆయనకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మనం ప్రేమ చూపించకపోతే, వాళ్లు యెహోవా ప్రేమను అర్థం చేసుకోలేకపోవచ్చు.

యెహోవా కుటుంబంలో మేము ప్రేమను రుచిచూశాం అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

ప్రేమ చూపించడం ముఖ్యమని లేలే, మీమీల అనుభవం ఎలా చూపిస్తుంది?

బ్రదర్స్‌-సిస్టర్స్‌ యెహోవా ప్రేమను రుచి చూడాలంటే . . .

  • మీరు వాళ్లను దేవుని అపురూపమైన గొర్రెల్లా చూడండి.—కీర్త 100:3

  • బలపర్చేలా మాట్లాడండి.—ఎఫె 4:29

  • వాళ్లకు ఎలా అనిపిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.—మత్త 7:11, 12

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 126, ప్రార్థన