కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 8-14

యోబు 34-35

జనవరి 8-14

పాట 30, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. అన్యాయం రాజ్యమేలుతుంటే

(10 నిమి.)

యెహోవా అన్యాయం చేయడం అసాధ్యమని గుర్తుంచుకోండి (యోబు 34:10; wp19.1 8వ పేజీ, 2వ పేరా)

చెడ్డవాళ్లు అన్యాయం చేసి శిక్ష తప్పించుకోవచ్చేమో గానీ, యెహోవా నుండి మాత్రం తప్పించుకోలేరు (యోబు 34:21-26; w17.04 10వ పేజీ, 5వ పేరా)

అన్యాయానికి గురైనవాళ్లకు మనం చేయగలిగే పెద్ద సాయం ఏంటంటే, వాళ్లకు యెహోవా గురించి నేర్పించడమే (యోబు 35:9, 10; మత్త 28:19, 20; w21.05 7వ పేజీ, 19-20 పేరాలు)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యోబు 35:7—“నీ నుండి [దేవుడు] తీసుకునేదేంటి?” అని ఎలీహు యోబును ఎందుకు అడిగాడు? (w17.04 29వ పేజీ, 3వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 10వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. పిల్లలు ఉన్న ఎవరికైనా jw.org పరిచయం చేసి, తల్లిదండ్రులకు ఉపయోగపడే సలహాలు చూపించండి. (lmd 1వ పాఠంలో 4వ పాయింట్‌)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

మన క్రైస్తవ జీవితం

పాట 58

7. అవకాశం దొరికినప్పుడల్లా ‘వాక్యాన్ని ప్రకటించాలనే’ తపన మీకుందా?

(15 నిమి.) చర్చ.

‘అత్యవసర భావంతో వాక్యాన్ని ప్రకటించమని’ పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. (2తి 4:2, అధస్సూచి) “అత్యవసర భావం” అని అనువదించిన గ్రీకు పదాన్ని, ఎప్పుడూ సిద్ధంగా ఉండే సైనికులు లేదా కాపలావాళ్ల గురించి చెప్పేటప్పుడు కొన్నిసార్లు వాడతారు. కాబట్టి, మామూలుగా మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా సాక్ష్యమివ్వడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని అర్థమౌతుంది.

మనం యెహోవాను ప్రేమిస్తాం, ఆయన మనకోసం చేసిన వాటన్నిటికీ రుణపడి ఉంటాం. అందుకే, ఆయనకున్న ఆకట్టుకునే లక్షణాల గురించి వేరేవాళ్లకు చెప్పాలని ఆరాటపడతాం.

కీర్తన 71:8 చదవండి. తర్వాత ఇలా అడగండి:

యెహోవాలో మీకు నచ్చే ఏ విషయాల గురించి వేరేవాళ్లకు చెప్పాలనుకుంటున్నారు?

మనం ప్రజల్ని కూడా ప్రేమిస్తాం కాబట్టి అనియత సాక్ష్యం ఇవ్వాలనే తపనతో ఉంటాం.

సత్యం ఎలా వందల మందికి చేరింది? అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  •   ఒక్కరు అనియత సాక్ష్యం ఇవ్వడం వల్ల వందల మందికి ఎలా సత్యం దొరికింది?

  •   ఇంతకుముందు చర్చికి వెళ్లినవాళ్లు, సత్యం తెలుసుకున్నాక ఎలా ప్రయోజనం పొందారు?

  • ప్రజల మీద ప్రేముంటే వాళ్లకు సాక్ష్యమిచ్చే అవకాశాల్ని వదులుకోం అని ఎందుకు చెప్పవచ్చు?

  • వేరేవాళ్లు యెహోవాను తెలుసుకోవడానికి అనియత సాక్ష్యం బాగా సహాయం చేస్తుందని మీకెందుకు అనిపిస్తుంది?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 138, ప్రార్థన