ఫిబ్రవరి 12-18
కీర్తనలు 5-7
పాట 118, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. వేరేవాళ్ల పనులు మిమ్మల్ని బాధపెట్టినా యెహోవాకు విశ్వసనీయంగా ఉండండి
(10 నిమి.)
కొన్నిసార్లు వేరేవాళ్ల పనుల వల్ల దావీదు చాలా బాధపడ్డాడు (కీర్త 6:6, 7)
సహాయం కోసం ఆయన యెహోవా వైపు చూశాడు (కీర్త 6:2, 9; w21.03 15వ పేజీ, 7-8 పేరాలు)
యెహోవా మీద కొండంత నమ్మకం ఉండడం వల్లే దావీదు విశ్వసనీయంగా ఉండగలిగాడు (కీర్త 6:10)
ఇలా ప్రశ్నించుకోండి, ‘వేరేవాళ్ల పనులు నన్ను బాధపెట్టినా యెహోవాకు విశ్వసనీయంగా ఉండేంత విశ్వాసం నాకుందా?’—w20.07 8-9 పేజీలు, 3-4 పేరాలు.
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 5:9—దుష్టుల గొంతు “తెరిచివున్న సమాధి” అని ఎందుకు చెప్పవచ్చు? (it-1-E 995వ పేజీ)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 7:1-11 (th 10వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd 1వ పాఠంలో 3వ పాయింట్)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(2 నిమి.) అనియత సాక్ష్యం. బైబిలు గురించి కాకుండా మామూలుగా మాట్లాడుతూ, మీరొక యెహోవాసాక్షి అని తెలిసేలా చేయండి. (lmd 2వ పాఠంలో 4వ పాయింట్)
6. మళ్లీ కలిసినప్పుడు
(2 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి మీతో వాదనకు దిగాలనుకుంటున్నాడు. (lmd 4వ పాఠంలో 5వ పాయింట్)
7. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు
(4 నిమి.) ప్రదర్శన. ijwfg 64—అంశం: దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో యెహోవాసాక్షులు ఎందుకు పాల్గొనరు? (lmd 3వ పాఠంలో 4వ పాయింట్)
పాట 99
8. వార్షిక సేవా రిపోర్టు
(15 నిమి.) చర్చ. వార్షిక సేవా రిపోర్టు గురించి బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన చదవండి. తర్వాత, ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2023 సేవా సంవత్సర నివేదిక నుండి తమకు నచ్చిన ఇతర అంశాల్ని చెప్పమని ప్రేక్షకుల్ని అడగండి. ముందే ఎంచుకున్న ప్రచారకుల్ని ఇంటర్వ్యూ చేసి, గత సంవత్సరం పరిచర్యలో ఎదురైన మంచి అనుభవాల్ని చెప్పమనండి.
9. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 5వ అధ్యాయంలో 16-22 పేరాలు, 42వ పేజీ బాక్సు