కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 19-25

కీర్తనలు 8-10

ఫిబ్రవరి 19-25

పాట 2, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. ‘యెహోవా, నిన్ను స్తుతిస్తాను’!

(10 నిమి.)

మనం ఊహించిన దానికి మించి, యెహోవా మనమీద మంచితనం చూపిస్తున్నాడు (కీర్త 8:3-6; w21.08 3వ పేజీ, 6వ పేరా)

యెహోవా అద్భుతమైన పనుల గురించి చెప్పడం ద్వారా మనం ఆయన్ని సంతోషంగా స్తుతిస్తాం (కీర్త 9:1; w20.05 23వ పేజీ, 10వ పేరా)

మనస్ఫూర్తిగా పాటలు పాడడం ద్వారా కూడా మనం ఆయన్ని స్తుతిస్తాం (కీర్త 9:2; w22.04 7వ పేజీ, 13వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను ఇంకా ఎలా యెహోవాను స్తుతించవచ్చు?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 8:3, అధస్సూచి—దేవుని ‘చేయి’ లేదా ‘చేతివేళ్లు’ అన్నప్పుడు కీర్తనకర్త ఉద్దేశం ఏంటి? (it-1-E 832వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. దేవుణ్ణి నమ్మను అని ఇంటివ్యక్తి చెప్తాడు. (lmd 5వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్మను గానీ సృష్టికర్త ఉన్నాడనే రుజువులు తెలుసుకోవడం ఇష్టమే అని చెప్పాడు. (th 7వ అధ్యాయం)

6. ప్రసంగం

(5 నిమి.) w21.06 6-7 పేజీలు, 15-18 పేరాలు—అంశం: యెహోవాను స్తుతించేలా మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి. (th 10వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 10

7. అనియత సాక్ష్యం సహజంగా ఎలా చేయవచ్చు?

(10 నిమి.) చర్చ.

యెహోవాను ఇంకా బాగా స్తుతించడానికి ఒక మార్గం ఏంటంటే, మన రోజువారీ పనుల్లో కలిసేవాళ్లకు సాక్ష్యం ఇవ్వడం. (కీర్త 35:28) అనియత సాక్ష్యం ఇవ్వడం మొదట్లో మనకు భయంగా అనిపించవచ్చు. కానీ సహజంగా ఎలా మాట్లాడడం మొదలుపెట్టాలో, ఎలా కొనసాగించాలో నేర్చుకుంటే దాన్ని బాగా చేయగలుగుతాం, ఇష్టంగా చేయగలుగుతాం!

“శాంతి సువార్త” ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి—మీరే మొదటి అడుగు వేయండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

ఈ వీడియోలో నేర్చుకున్న ఏ విషయం, మీరు ఇంకా బాగా అనియత సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది?

మాటలు మొదలుపెట్టడానికి కొన్ని టిప్స్‌:

  •   మీరు ఇంటి నుండి బయటికి వెళ్తున్న ప్రతీసారి, సాక్ష్యమిచ్చే అవకాశాల కోసం చూడండి. దాని గురించి ప్రార్థించి, మంచి మనసున్న వాళ్లను కలిసేలా సహాయం చేయమని యెహోవాను అడగండి

  •   స్నేహపూర్వకంగా ఉండండి, మీరు కలిసేవాళ్ల మీద శ్రద్ధ చూపించండి. వాళ్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడు వాళ్లతో ఏ బైబిలు విషయం మాట్లాడితే బాగుంటుందో మీకు అర్థమౌతుంది

  •   పరిస్థితిని బట్టి, వాళ్ల నంబర్‌ తీసుకోవడానికి లేదా మీ నంబర్‌ ఇవ్వడానికి ప్రయత్నించండి

  •   సాక్ష్యం ఇవ్వకముందే మాటలు ముగిసిపోయినా బాధపడకండి

  •   మాట్లాడడం అయిపోయాక కూడా వాళ్ల గురించి ఆలోచించండి. వాళ్ల మీద శ్రద్ధ చూపిస్తూనే ఉండడానికి ఏదైనా బైబిలు వచనం లింక్‌ గానీ, jw.org ఆర్టికల్‌ లింక్‌ గానీ పంపించండి

ఇలా చేసి చూడండి: ఎవరైనా మిమ్మల్ని ‘ఈ ఆదివారం ఎలా గడిచింది?’ అని అడిగితే, మీరు మీటింగ్‌లో నేర్చుకున్న ఏదైనా విషయం చెప్పండి, లేదా ఆసక్తి చూపించేవాళ్లకు మీరెలా బైబిలు విషయాలు నేర్పిస్తారో చెప్పండి.

8. స్థానిక అవసరాలు

(5 నిమి.)

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 65, ప్రార్థన