ఫిబ్రవరి 26–మార్చి 3
కీర్తనలు 11-15
పాట 139, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. శాంతి విలసిల్లే కొత్తలోకంలో మిమ్మల్ని ఊహించుకోండి
(10 నిమి.)
ప్రజలు నీతిన్యాయాల్ని పట్టించుకోకపోతే హింస చెలరేగుతుంది (కీర్త 11:2, 3; w06 5⁄15 18వ పేజీ, 3వ పేరా)
త్వరలోనే యెహోవా హింసకు చెక్ పెట్టేస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు (కీర్త 11:5; wp16.3 13వ పేజీ)
రాబోయే ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తే, కొత్తలోకం వచ్చేవరకు ఓపిగ్గా ఉండగలుగుతాం (కీర్త 13:5, 6; w17.08 7వ పేజీ, 15వ పేరా)
ఇలా చేసి చూడండి: యెహెజ్కేలు 34:25 చదివి, అక్కడ చెప్పిన ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు ఊహించుకోండి.—kr 236వ పేజీ, 16వ పేరా.
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
కీర్త 14:1—క్రైస్తవులు కూడా ఎలా ఆలోచించే ప్రమాదం ఉంది? (w13 9⁄15 19వ పేజీ, 12వ పేరా)
-
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 13:1–14:7 (th 2వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(2 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (lmd 5వ పాఠంలో 3వ పాయింట్)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(1 నిమి.) ఇంటింటి పరిచర్య. జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (lmd 3వ పాఠంలో 4వ పాయింట్)
6. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) ఇంటింటి పరిచర్య. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రం ఇచ్చినప్పుడు ఇంటివ్యక్తి ఆసక్తి చూపిస్తాడు. (lmd 7వ పాఠంలో 4వ పాయింట్)
7. శిష్యుల్ని చేసేటప్పుడు
(5 నిమి.) lff 13వ పాఠంలో ఒక్కమాటలో, మీరేం నేర్చుకున్నారు, ఇలా చేసి చూడండి. అలాగే “ఇవి కూడా చూడండి”లో ఉన్న ఏదైనా ఆర్టికల్ ఉపయోగించి, అబద్ధమతం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకునేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. (th 12వ అధ్యాయం)
పాట 8
8. “యుద్ధ ఆయుధాల కన్నా తెలివి మేలు”
(10 నిమి.) చర్చ.
ప్రపంచంలో ఎక్కడ చూసినా హింస ఎక్కువ అవుతోంది. మనం హింసను చూసినా, దాని బారినపడినా కంగారుపడిపోతామని యెహోవాకు తెలుసు. మనకు సంరక్షణ అవసరమని కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన మనల్ని సంరక్షించే ఒక విధానం, తన వాక్యమైన బైబిలు!—కీర్త 12:5-7.
బైబిల్లో ఉన్న తెలివి ‘యుద్ధ ఆయుధాల కన్నా మేలైనది.’ (ప్రస 9:18) ఈ కింది బైబిలు సూత్రాలు పాటించడం వల్ల మనం హింసకు బలి అవ్వకుండా ఎలా జాగ్రత్తపడవచ్చో గమనించండి.
-
ప్రస 4:9, 10—సురక్షితంకాని ప్రాంతాల్లో, పరిస్థితుల్లో ఒక్కరే ఉండకండి
-
సామె 22:3—నలుగురిలో ఉన్నప్పుడు, చుట్టూ ఏం జరుగుతుందో ఓ కంట కనిపెట్టుకుని ఉండండి
-
సామె 26:17—మీకు సంబంధంలేని గొడవల్లో తలదూర్చకండి
-
సామె 17:14—గొడవ మొదలయ్యేలా ఉంటే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లండి. నిరసన చేస్తున్న గుంపులకు దూరంగా ఉండండి
-
లూకా 12:15—మీ వస్తువుల్ని కాపాడుకోవడం కోసం మీ ప్రాణాన్ని తాకట్టు పెట్టకండి
విశ్వాసం చూపించినవాళ్లను అనుకరించండి, విశ్వాసం లేనివాళ్లను కాదు—హనోకును అనుకరించండి, లెమెకును కాదు అనే వీడియో చూపించి, ఇలా అడగండి:
హింస చెలరేగినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి, ఒక తండ్రికి హనోకు ఉదాహరణ ఎలా సహాయం చేసింది?—హెబ్రీ 11:5
కొన్నిసార్లు, ఒక క్రైస్తవుడు తనను లేదా తన వస్తువుల్ని కాపాడుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అయితే, అతను వేరొకరి ప్రాణం తీయకుండా తన చేతనైనంత కృషి చేస్తాడు.—కీర్త 51:14; జూలై 2017 కావలికోటలో వచ్చిన “పాఠకుల ప్రశ్న” చూడండి.
9. జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మార్చి 2, శనివారం నుండి మొదలౌతుంది
(5 నిమి.) పెద్ద ఇచ్చే ప్రసంగం. ప్రచార కార్యక్రమం, ప్రత్యేక ప్రసంగం, అలాగే జ్ఞాపకార్థ ఆచరణ కోసం మీ సంఘంలో చేసిన ఏర్పాట్లను చెప్పండి. మార్చి, ఏప్రిల్ నెలల్లో 15 గంటలు సహాయ పయినీరు సేవచేసే అవకాశం ఉందని ప్రచారకులకు గుర్తుచేయండి.
10. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 6వ అధ్యాయంలో 9-17 పేరాలు