జనవరి 20-26
కీర్తనలు 138-139
పాట 93, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. కంగారు వల్ల, భయం వల్ల ఆగిపోకండి
(10 నిమి.)
యెహోవాను నిండు హృదయంతో సేవించాలని మనం కోరుకుంటాం (కీర్త 138:1)
మీటింగ్స్‌లో కామెంట్స్ చెప్పడానికి భయమేస్తే, యెహోవా సహాయం తీసుకోండి (కీర్త 138:3)
కొన్ని సందర్భాల్లో కంగారు, భయం మంచివే (కీర్త 138:6; w19.01 10వ పేజీ, 10వ పేరా)
టిప్: కామెంట్స్ చిన్నగా ఉంటే, మనకు అంతగా భయం వేయదు.—w23.04 21వ పేజీ, 7వ పేరా.
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
కీర్త 139:21, 22—క్రైస్తవులు ప్రతీఒక్కర్ని తప్పకుండా క్షమించాల్సిందేనా? (it-1-E 862వ పేజీ, 4వ పేరా)
-
ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 139:1-18 (th 2వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. (lmd 2వ పాఠంలో 3వ పాయింట్)
5. శిష్యుల్ని చేసేటప్పుడు
(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పి, దాన్ని ఎలా చేస్తారో చూపించండి. (lmd 10వ పాఠంలో 3వ పాయింట్)
6. ప్రసంగం
(5 నిమి.) ijwyp 105— అంశం: సిగ్గు, మొహమాటం ఎలా తగ్గించుకోవచ్చు? (th 16వ అధ్యాయం)
పాట 59
7. సిగ్గు, మొహమాటం ఉన్నా మీరు పరిచర్యలో ఆనందించవచ్చు
(15 నిమి.) చర్చ.
మీకు సిగ్గు, మొహమాటం కాస్త ఎక్కువా? నలుగురిలో ముందుకు రావడానికి అంతగా ఇష్టపడరా? వేరేవాళ్లతో మాట్లాడాలంటే మీ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయా? కొన్నిసార్లు సిగ్గు, మొహమాటం వల్ల నచ్చిన పనులు కూడా చేయలేం. అయితే చాలామంది తమ సిగ్గును, మొహమాటాన్ని తీసేసుకుని ప్రీచింగ్‌లో కొత్తవాళ్లతో మాట్లాడుతున్నారు, పరిచర్యను చక్కగా ఆనందిస్తున్నారు. వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
నా బెస్ట్ ఇవ్వడానికి సిగ్గును అడ్డు రానివ్వలేదు అనే వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
-
“నీ మనసంతా యెహోవా సేవ మీదే పెట్టు” అని వాళ్ల నానమ్మ ఇచ్చిన సలహా సిస్టర్‌కి ఎలా సహాయం చేసింది?
మోషే, యిర్మీయా, తిమోతి కూడా ఈ సమస్యతో పోరాడారని బైబిలు చెప్తుంది. (నిర్గ 3:11; 4:10; యిర్మీ 1:6-8; 1తి 4:12) అయినా, యెహోవా సహాయంతో వాళ్లు దేవుని సేవలో గొప్పగొప్ప పనులు చేశారు. (నిర్గ 4:12; యిర్మీ 20:11; 2తి 1:6-8)
యెషయా 43:1, 2 చదవండి. తర్వాత ఇలా అడగండి:
-
తన ఆరాధకులకు యెహోవా ఏమని మాటిస్తున్నాడు?
పరిచర్యలో ఆనందించేలా యెహోవా సిగ్గు, మొహమాటం ఉన్నవాళ్లకు ఎలా సహాయం చేస్తాడు?
బాప్తిస్మం గొప్ప సంతోషానికి నడిపిస్తుంది—చిన్నభాగం అనే వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
-
పరిచర్యలో యెహోవా సహాయాన్ని, శక్తిని సిస్టర్ జాక్సన్ ఎలా రుచి చూసింది?
-
సిగ్గును, బిడియాన్ని తీసేసుకోవడానికి పరిచర్య ఎలా సహాయం చేస్తుంది?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 21వ అధ్యాయంలో 8-13 పేరాలు, 169వ పేజీ బాక్సు