కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 27–ఫిబ్రవరి 2

కీర్తనలు 140-143

జనవరి 27–ఫిబ్రవరి 2

పాట 44, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. మీ ప్రార్థనలకు తగ్గట్టు నడుచుకోండి

(10 నిమి.)

సలహాను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి (కీర్త 141:5; w22.02 12వ పేజీ, 13-14 పేరాలు)

గతంలో యెహోవా చేసిన సహాయాన్ని గుర్తుచేసుకోండి (కీర్త 143:5; w10 3/15 32వ పేజీ, 4వ పేరా)

విషయాల్ని యెహోవా చూసినట్టు చూడండి (కీర్త 143:10; w15 3/15 32వ పేజీ, 2వ పేరా)

140-143 కీర్తనలు, సహాయం కోసం దావీదు యెహోవాకు ఎలా ప్రార్థించాడో, ఆ ప్రార్థనలకు తగ్గట్టు ఎలా ప్రవర్తించాడో చెప్తున్నాయి.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 140:3—దావీదు చెడ్డవాళ్ల నాలుకను పాము నాలుకతో ఎందుకు పోల్చాడు? (it-2-E 1151వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ఎవరికైనా ఏదైనా హెల్ప్‌ చేసిన తర్వాత, సంభాషణ మొదలుపెట్టండి. (lmd 3వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. ఎదుటివ్యక్తి బిజీగా ఉన్నానని చెప్తాడు. (lmd 7వ పాఠంలో 3వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రదర్శన. ijwfq 21—అంశం: యెహోవాసాక్షులు రక్తమార్పిడులను ఎందుకు అంగీకరించరు? (th 7వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 141

7. వైద్య చికిత్స లేదా సర్జరీ చేయించుకునే పరిస్థితి రాకముందే సిద్ధపడండి

(15 నిమి.) చర్చ.

‘కష్టకాలాల్లో ఎప్పుడూ సహాయం చేస్తాను’ అని యెహోవా మాటిస్తున్నాడు. (కీర్త 46:1) ఏదైనా ట్రీట్‌మెంట్‌ గానీ సర్జరీ గానీ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు చాలా కంగారుగా, దిగులుగా ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితులకు సిద్ధపడేలా యెహోవా మనకు కావల్సినవన్నీ ఇచ్చాడు. ఉదాహరణకు, అడ్వాన్స్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టివ్‌ (డిపిఎ) కార్డును, ఐడెంటిటీ కార్డును, a వైద్యానికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను b సంస్థ మనకు అందిస్తోంది. అంతేకాదు ఆసుపత్రి అనుసంధాన కమిటీల్ని (HLC) కూడా ఏర్పాటు చేసింది. కరక్తం విషయంలో దేవుడు పెట్టిన నియమాన్ని పాటించడానికి ఇవన్నీ మనకు సహాయం చేస్తాయి.—అపొ 15:28, 29.

వైద్య సహాయం అవసరమయ్యే పరిస్థితుల కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • అడ్వాన్స్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టివ్‌ (డిపిఎ) కార్డు నింపి ఉంచుకోవడం వల్ల కొంతమంది ఎలా ప్రయోజనం పొందారు?

  • తల్లులు కాబోయేవారి కోసం సమాచారం (S-401) అనే డాక్యుమెంట్‌ కొంతమందికి ఎలా సహాయం చేసింది?

  • మీరు హాస్పిటల్‌లో చేరాల్సిన, సర్జరీ చేయించుకోవాల్సిన, కాన్సర్‌ లాంటి వాటికి ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. ఆ సందర్భంలో మీరు రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం లేకపోయినా వీలైనంత త్వరగా ఆసుపత్రి అనుసంధాన కమిటీతో మాట్లాడడం ఎందుకు మంచిది?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 103, ప్రార్థన

a బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులు లిటరేచర్‌ సర్వెంట్‌ను అడిగి డిపిఎ కార్డును, తమ మైనరు పిల్లల కోసం ఐడెంటిటీ కార్డును తీసుకోవచ్చు.

b తల్లులు కాబోయేవారి కోసం సమాచారం (S-401), సర్జరీ లేదా కీమోథెరపీ అవసరమైన రోగులకు సమాచారం (S-407), పిల్లలకు వైద్య చికిత్స అవసరమైనప్పుడు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సమాచారం (S-55) డాక్యుమెంట్లను మీ పెద్దల్ని అడిగి తీసుకోవచ్చు.