కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 6-12

కీర్తనలు 127-134

జనవరి 6-12

పాట 134, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. తల్లిదండ్రులారా—యెహోవా ఇచ్చిన ఆస్తిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి

(10 నిమి.)

కుటుంబ అవసరాలు చూసుకోవడానికి తల్లిదండ్రులు యెహోవా సహాయం తీసుకోవచ్చు (కీర్త 127:1, 2)

పిల్లలు యెహోవా ఇచ్చిన విలువైన ఆస్తి (కీర్త 127:3; w21.08 5వ పేజీ, 9వ పేరా)

ఒక్కొక్కరి అవసరాలకు తగ్గట్టు పిల్లలకు శిక్షణ ఇవ్వండి (కీర్త 127:4; w19.12 27వ పేజీ, 20వ పేరా)

తల్లిదండ్రులు యెహోవా సహాయం తీసుకుంటూ, పిల్లల్ని బాగా చూసుకున్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 128:3—కీర్తనకర్త పిల్లల్ని ఒలీవ మొక్కలతో ఎందుకు పోల్చాడు? (it-1-E 543వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. (lmd 1వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. బైబిలు చెప్పేదానికి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాన్ని ఎదుటివ్యక్తి చెప్తారు. (lmd 5వ పాఠంలో 4వ పాయింట్‌)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

(5 నిమి.) lff 16వ పాఠంలో 4-5 పాయింట్స్‌. మీరు ఊరిలో లేనప్పుడు, స్టడీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారో విద్యార్థికి చెప్పండి. (lmd 10వ పాఠంలో 4వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 13

7. తల్లిదండ్రులారా—మీరు ఈ చక్కని పనిముట్టును ఉపయోగిస్తున్నారా?

(15 నిమి.) చర్చ.

తల్లిదండ్రులు తమ పిల్లలకు యెహోవా గురించి నేర్పించడానికి సంస్థ బోలెడన్ని ఆర్టికల్స్‌, వీడియోలు, పత్రికలు, పుస్తకాలు తయారుచేసింది. అయితే పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రుల దగ్గరున్న బెస్ట్‌ పనిముట్టు ఏంటంటే, వాళ్ల ఆదర్శం.—ద్వితీ 6:5-9.

యేసు, ఈ చక్కని పనిముట్టును ఉపయోగించే తన శిష్యులకు నేర్పించాడు.

యోహాను 13:13-15 చదవండి. తర్వాత ఈ ప్రశ్న అడగండి:

  • యేసు తన ఆదర్శం ద్వారా బోధించడం ఎందుకు ఒక చక్కని పద్ధతి?

తల్లిదండ్రులుగా మీరు చేసే పనులు, మీరు నేర్పించేవాటి విలువను పెంచుతాయి. మీ ఆదర్శం మీరు చెప్పేవాటి మీద గౌరవాన్ని పెంచి, వాటిని పాటించాలనే కోరికను కలిగిస్తుంది.

మా ఆదర్శం ద్వారా పిల్లలకు బోధించాం అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • వీడియోలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి ముఖ్యమైన పాఠాలు నేర్పించారు?

  • పిల్లలకు మంచి ఆదర్శం ఉంచాలనే మీ కోరికను ఈ వీడియో ఎలా పెంచింది?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 73, ప్రార్థన