కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 24–మార్చి 2

సామెతలు 2

ఫిబ్రవరి 24–మార్చి 2

పాట 35, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. వ్యక్తిగత అధ్యయనాన్ని ఎందుకు మనసుపెట్టి చేయాలి?

(10 నిమి.)

సత్యాన్ని ఎంత విలువైనదిగా ఎంచుతున్నారో చూపించడానికి (సామె 2:3, 4; w22.08 18వ పేజీ, 16వ పేరా)

మంచి నిర్ణయాలు తీసుకోవడానికి (సామె 2:5-7; w22.10 19వ పేజీ, 3-4 పేరాలు)

విశ్వాసాన్ని పెంచుకోవడానికి (సామె 2:11, 12; w16.09 23వ పేజీ, 2-3 పేరాలు)

ఇలా ప్రశ్నించుకోండి: ‘నా వ్యక్తిగత అధ్యయనాన్ని ఇంకా బాగా ఎలా చేయవచ్చు?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 2:7—“యథార్థంగా నడుచుకునేవాళ్లకు” యెహోవా ఒక ‘డాలులా’ ఎలా ఉంటాడు? (it-1-E 1211వ పేజీ, 4వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. భార్యాభర్తలకు ఉపయోగపడే సమాచారాన్ని jw.org వెబ్‌సైట్‌లో ఎలా చూడవచ్చో చెప్పండి. (lmd 1వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. ఇంతకుముందు కలిసినప్పుడు ఆసక్తి చూపించిన విషయం గురించి ఒక పత్రిక ఇవ్వండి. (lmd 9వ పాఠంలో 3వ పాయింట్‌)

6. ప్రసంగం

(5 నిమి.) lmd అనుబంధం A 8వ పాయింట్‌—అంశం: భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. (th 13వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 96

7. దాచబడిన సంపదల్ని మీరు వెతుకుతున్నారా?

(15 నిమి.) చర్చ.

యౌవనులారా, దాచిపెట్టిన సంపదల్ని వెతకడం లేదా ట్రెజర్‌ హంట్‌ అంటే మీకు ఇష్టమా? అలాగైతే, ఈ విశ్వంలోనే అతి విలువైన సంపదను వెతకమని, అంటే దేవుని గురించిన జ్ఞానాన్ని వెతకమని బైబిలు మీకు చెప్తుంది. (సామె 2:4, 5) ప్రతీరోజు బైబిలు చదవడం ద్వారా, చదివిన దాని గురించి లోతుగా పరిశోధన చేయడం ద్వారా మీరు ఆ సంపదను కనిపెట్టవచ్చు. అది చాలా సరదాగా ఉంటుంది, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

  • బైబిల్ని చదువుతున్నప్పుడు మీరు ఏ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు? (w24.02 32వ పేజీ, 2-3 పేరాలు)

  • జవాబులు తెలుసుకోవడానికి మీరు ఏ పనిముట్లను ఉపయోగించవచ్చు?

బైబిల్లో చదివిన దాని గురించి ఎలా ధ్యానించవచ్చో తెలుసుకోవడానికి, యెహోవా స్నేహితుల నుండి నేర్చుకోండి అనే వీడియో సిరీస్‌ సహాయం చేస్తుంది.

యెహోవా స్నేహితుల నుండి నేర్చుకోండి—హేబెలు వీడియో చూపించండి

ఆదికాండం 4:2-4, హెబ్రీయులు 11:4 చదవండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి:

  • తను యెహోవాకు స్నేహితుడని హేబెలు ఎలా చూపించాడు?

  • యెహోవా మీద విశ్వాసాన్ని హేబెలు ఎలా పెంచుకున్నాడు?

  • మీ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 102, ప్రార్థన