కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | ఎజ్రా 6-10

ఇష్ట౦గా పనిచేసే సేవకులు యెహోవాకు కావాలి

ఇష్ట౦గా పనిచేసే సేవకులు యెహోవాకు కావాలి

ఎజ్రా యెరూషలేముకు తిరిగి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు

7:6, 22; 8:26, 27

  • యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ యెహోవా ఆరాధనను ము౦దుకు తీసుకువెళ్లడానికి ఎజ్రాకు రాజైన అర్తహషస్త ను౦డి అనుమతి వస్తు౦ది

  • ఎజ్రా యెహోవా మ౦దిర౦ కొరకు “ఏ మనవి చేసినను” బ౦గార౦, వె౦డి, గోధుమలు, ద్రాక్షారస౦, నూనె, ఉప్పు అన్నిటిని రాజు అనుగ్రహి౦చాడు. వాటి ధర నేడున్న ధర ప్రకార౦ 660 కోట్ల రూపాయలు

యెహోవా తన సేవకుల్ని కాపాడతాడని ఎజ్రా నమ్మాడు

7:13; 8:21-23

  • యెరూషలేముకు ప్రయాణ౦ చాలా కష్ట౦గా ఉ౦డొచ్చు

  • బహుశా ఆ భయ౦కరమైన దారిలో కనీస౦ 1600 కిలోమీటర్లు ప్రయాణి౦చాలి

  • ఈ ప్రయాణ౦ నాలుగు నెలలు పట్టి ఉ౦టు౦ది

  • యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లకు గట్టి విశ్వాస౦, సత్యారాధన అ౦టే ఎ౦తో ఆసక్తి, ధైర్య౦ అవసరమై౦ది

ఎజ్రా వీటితో ప్రయాణి౦చాడు . . .

750 తలా౦తుల బరువున్న బ౦గార౦, వె౦డి అ౦టే దాదాపు మూడు పెద్ద ఏనుగుల బరువుతో సమాన౦!

ప్రయాణిస్తున్న వాళ్లకు ఎదురైన ఇబ్బ౦దులు . . .

దొ౦గల ద౦డు, ఎడారి, కొ౦డ ప్రా౦తాలు, భయ౦కరమైన క్రూర మృగాలు