జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ జనవరి 2018
ఇలా మాట్లాడవచ్చు
బైబిలు ఈ రోజుల్లో కూడా ఉపయోగపడుతుందని తెలిపే ఇలా మాట్లాడవచ్చు ప్రదర్శనల సిరీస్.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పరలోక రాజ్యం దగ్గరపడింది”
యోహాను సాదాసీదాగా జీవిస్తూ దేవుని చిత్తం చేయడానికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశాడు. నేడు కూడా సాదాసీదాగా జీవించడం ద్వారా మనం దేవుని సేవను ఎక్కువ చేయగలుగుతాం.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
యేసు కొండమీద ప్రసంగంలో మనం నేర్చుకునే పాఠాలు
మన ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించడం అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడానికి మనకున్న పట్టికను ఎలా మెరుగు చేసుకోవచ్చు?
మన క్రైస్తవ జీవితం
ముందు మీ సహోదరునితో సమాధానపడాలి—ఎలా?
మన సహోదరునితో సమాధానపడడానికీ, దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధించడానికీ ఉన్న సంబంధం గురించి యేసు ఏమి బోధిస్తున్నాడు?
దేవుని వాక్యంలో ఉన్న సంపద
దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి
మనం ప్రార్థన చేయాల్సిన విషయాలన్నిటిలో మనం దేన్ని ముఖ్యంగా చూడాలి?
మన క్రైస్తవ జీవితం
ఆందోళన పడడం మానేయండి
కొండమీద ప్రసంగంలో, ఆందోళన పడడం మానేయండి అని యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు ఆయన మాటల అర్థం ఏమిటి?
దేవుని వాక్యంలో ఉన్న సంపద
యేసు ప్రజలను ప్రేమించాడు
యేసు ప్రజలను బాగు చేసినప్పుడు ఆయన తన శక్తిని చూపించాడు, కానీ అంతకన్నా ఎక్కువగా ఆయన తనకున్న గొప్ప ప్రేమను, దయను ఇతరుల మీద చూపించాడు.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
యేసు సేదదీర్పును ఇచ్చాడు
బాప్తిస్మం తీసుకుని యేసు శిష్యులుగా ఆయన కాడిని అంగీకరించినప్పుడు మనం కష్టంగా ఉండే పనిని చేయడానికి, బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకున్నాం. కానీ అలా చేయడం సేదదీర్పును తెస్తుంది.