చక్కగా సువార్త ప్రకటిద్దాం
ముందు మీ సహోదరునితో సమాధానపడాలి—ఎలా?
మీరు యేసు కాలంలో గలిలయలో జీవిస్తున్నారు అనుకుందాం. మీరు పర్ణశాలల పండుగ జరుపుకోవడానికి యెరూషలేముకు వచ్చారు. దూరదూరాల నుండి వచ్చిన తోటి ఆరాధకులతో ఆ పట్టణం కళకళలాడిపోతుంది. మీరు యెహోవాకు ఒక అర్పణను ఇవ్వాలని అనుకున్నారు. కాబట్టి మీరు మీ చేతుల్లో మేకను పట్టుకుని పట్టణ దారుల్లో, కిటకిటలాడుతున్న ప్రజల మధ్య దారి చేసుకుంటూ ఆలయం వైపు వెళ్లడం మొదలు పెట్టారు. మీరు చేరుకునేటప్పటికి ఆలయంలో చాలామంది ఉన్నారు. వాళ్లు కూడా అర్పణను అర్పించడానికి వచ్చారు. చివరికి మీరు తెచ్చిన మేకను యాజకులకు ఇవ్వడానికి మీ వంతు వచ్చింది. ఆ క్షణంలో ఆ సమూహంలోనే ఎక్కడో ఉన్న మీ సహోదరుడికి మీతో ఏదో సమస్య ఉందని మీకు గుర్తుకువచ్చింది. అప్పుడు మీరు ఏమి చేయాలో యేసు వివరిస్తున్నాడు. (మత్తయి 5:24 చదవండి.) మీరూ, మీ వల్ల బాధపడిన మీ సహోదరుడూ యేసు చెప్పినట్లు ఎలా సమాధానపడవచ్చు. ఈ క్రింద ఇచ్చిన విషయాల్లో మీ జవాబు పక్కన ఒక టిక్ మార్కు పెట్టండి.
మీరు ఏమి చేయాలి . . .
-
అతను బాధపడడానికి సరైన కారణం ఉంటేనే మీరు మీ సహోదరునితో మాట్లాడాలి
-
అతను మరీ అతి సున్నితంగా ఉన్నాడని లేదా అందులో అతని తప్పు కూడా ఉందని మీకు అనిపిస్తే మీరు మీ సహోదరుడి ఆలోచనను సరిచేయడానికి ప్రయత్నించాలి
-
అతను మనసు విప్పి మాట్లాడుతుంటే ఓపికగా వినాలి. ఒకవేళ మీకు పూర్తిగా అర్థం కాకపోయినా, అతనికి కలిగిన బాధను బట్టి లేదా మీ పనులవల్ల వచ్చిన అనుకోని పర్యవసానాలను బట్టి నిజాయితీగా మీ సహోదరున్ని క్షమాపణ అడగాలి
మీ సహోదరుడు ఏమి చేయాలి . . .
-
మీరు అతని విషయంలో ఏమి తప్పు చేశారో మీ సహోదరుడు సంఘంలో వేరేవాళ్లకు చెప్పి వాళ్ల నుండి ఓదార్పును లేదా మద్దతును పొందాలి
-
మిమ్మల్ని తిడుతూ, మీరు చేసిన తప్పు గురించి ప్రతీ విషయాన్ని మీ ముందు బయటపెట్టాలి, మీ తప్పును ఒప్పుకోమని కోరుకోవాలి
-
మీరు అతని దగ్గరకు వెళ్లడానికి మిమ్మల్ని మీరు ఎలా తగ్గించుకున్నారో ఎలా ధైర్యం చేశారో మీ సహోదరుడు గుర్తించి మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమించాలి
ఇప్పుడు మనం ఆరాధనలో బలులు అర్పించడం లేదు. కానీ మన సహోదరునితో సమాధానపడడానికీ, దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధించడానికీ ఉన్న సంబంధం గురించి యేసు ఏమి బోధిస్తున్నాడు?