మన క్రైస్తవ జీవితం
ఆందోళన పడడం మానేయండి
కొండమీద ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “మీ ప్రాణం గురించి . . . ఆందోళన పడడం మానేయండి.” (మత్త 6:25) సాతాను లోకంలో జీవిస్తున్న అపరిపూర్ణ మనుషులు అప్పుడప్పుడు ఆందోళన పడడం సహజమే. కానీ యేసు తన అనుచరులకు మరీ ఎక్కువగా ఆందోళన లేదా కంగారు పడవద్దని నేర్పిస్తున్నాడు. (కీర్త 13:2) ఎందుకు? ఎందుకంటే, అనవసరంగా కంగారు పడితే, మన ఆలోచనలు వేరే విషయాల వైపు వెళ్లిపోవచ్చు. మన రోజువారీ అవసరాల విషయంలో అయినాసరే కంగారు పడడం వల్ల, మన మనసు పక్కకు వెళ్లిపోయి మనం దేవుని రాజ్యాన్ని మొదట వెదకడం చాలా కష్టం అవుతుంది. (మత్త 6:33) యేసు ఆ తర్వాత చెప్పిన విషయాలు మనం అనవసరంగా ఆందోళన పడకుండా ఉండడానికి సహాయం చేస్తాయి.
-
మత్త 6:26—పక్షుల్ని గమనించడం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు? (w16.07 9-10 పేజీలు, 11-13 పేరాలు)
-
మత్త 6:27—అనవసరమైన ఆందోళన ఎందుకు సమయాన్ని, శక్తిని వృథా చేస్తుంది? (w05 11/1 22వ పేజీ, 5వ పేరా)
-
మత్త 6:28-30—పొలంలో ఉన్న అడవి పూల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w16.07 10-11 పేజీలు, 15-16 పేరాలు)
-
మత్త 6:31, 32—క్రైస్తవులు ఏ విధంగా ఇతరుల నుండి వేరుగా ఉన్నారు? (w16.07 11వ పేజీ, 17వ పేరా)
నేను వీటి గురించి ఆందోళన పడడం ఆపేయాలని అనుకుంటున్నాను