యేసు సేదదీర్పును ఇచ్చాడు
“నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది”
వడ్రంగిగా యేసుకు కాడిని ఎలా తయారు చేయాలో తెలుసు. కాడితో పనిచేస్తున్నప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా బహుశా ఆ కాడిని ఆయన గుడ్డతో గానీ తోలుతో గానీ చుట్టి ఉండవచ్చు. మనం మన బాప్తిస్మం అప్పుడు యేసు శిష్యులుగా ఆయన కాడిని అంగీకరించాం. అంటే మనం కష్టంగా ఉండే పనిని చేయడానికి, బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకున్నాం. కానీ అలా చేయడం వల్ల సేదదీర్పు కలుగుతుంది, దానివల్ల ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి.
యేసు కాడి కిందకు వచ్చినప్పటి నుండి మీరు ఏ ఆశీర్వాదాలను ఆనందిస్తున్నారు?