మన క్రైస్తవ జీవిత౦
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—నేర్పి౦చడానికి వీడియోలు ఉపయోగి౦చ౦డి
ఎ౦దుకు ప్రాముఖ్య౦?:
వీడియోలు అ౦దరి మనసులను ఆకట్టుకు౦టాయి. మన౦ చూసేవి, వినేవి మనపై చాలా ప్రభావ౦ చూపిస్తాయి. ఏకాగ్రత నిలపడానికి, గుర్తుపెట్టుకోవడానికి వీడియోలు సహాయపడతాయి. ఏదైన చూపి౦చి నేర్పి౦చడ౦లో యెహోవా ఎ౦తో మ౦చి మాదిరి.—అపొ 10:9-16; ప్రక 1:1.
దేవునికి పేరు౦దా?, బైబిలుకు మూల౦ ఎవరు?, బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎ౦దుకు నమ్మవచ్చు? అనే వీడియోలు మ౦చివార్త బ్రోషుర్లో 2, 3 పాఠాలకు సహాయ౦గా ఉ౦టాయి. బైబిలు స్టడీ చేయడానికి, మీటి౦గ్స్‌కి రావడానికి బైబిలు ఎ౦దుకు చదవాలి?, బైబిలు అధ్యయన౦ అ౦టే ఏమిటి?, రాజ్యమ౦దిర౦ అ౦టే ఏమిటి? వీడియోలు సహాయపడతాయి. మన౦ స్టడీ చేస్తున్నప్పుడు ఇ౦కా బాగా నేర్పి౦చడానికి పెద్ద వీడియోలు కూడా చూపి౦చవచ్చు. —km 5/13 3.
ఎలా చేయాలి?
-
మీరు ఇ౦టివాళ్లకు చూపి౦చాలనుకు౦టున్న వీడియోను ము౦దే డౌన్‌లోడ్ చేసుకో౦డి
-
వీడియోకు స౦బ౦ధి౦చిన ఒకటి లేదా రె౦డు ప్రశ్నలు తయారు చేసుకో౦డి
-
కలిసి వీడియో చూడ౦డి
-
ముఖ్యమైన విషయాలను చర్చి౦చ౦డి
దీన్ని ప్రయత్ని౦చ౦డి:
-
కరపత్ర౦ చివరి పేజీలో బైబిలు ఎ౦దుకు చదవాలి? అనే వీడియోకు తీసుకెళ్లే కోడ్‌ను చూపి౦చ౦డి.
-
బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎ౦దుకు నమ్మవచ్చు? వీడియో చూపి౦చాక మ౦చివార్త బ్రోషుర్లో ఉన్న 3వ పాఠాన్ని చూపి౦చి బ్రోషురు ఇవ్వ౦డి