మన క్రైస్తవ జీవితం
తల్లిదండ్రులారా, మీ పిల్లలు అభివృద్ధి సాధించేలా మంచి అవకాశం ఇవ్వండి
దైవభక్తి గల తల్లిదండ్రులు తమ పిల్లలు యెహోవాకు నమ్మకమైన సేవకులైతే చూడాలని ఎంతో కోరుకుంటారు. పిల్లలు అలా తయారవ్వాలంటే, చిన్నతనం నుండే పిల్లల మనసుల్లో బైబిలు బోధల్ని నాటడం ద్వారా తల్లిదండ్రులు వాళ్లకు సహాయం చేయవచ్చు. (ద్వితీ 6:7; సామె 22:6) అందుకు స్వయంత్యాగం చేయాల్సి ఉంటుందా? అవును ఖచ్చితంగా! కానీ దానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది.—3 యోహా 4.
యోసేపు, మరియల నుండి తల్లిదండ్రులు ఎంతో నేర్చుకోవచ్చు. ఎంతో శ్రమతో, ఖర్చుతో కూడుకున్నదే అయినా వాళ్లు “పస్కా పండుగ కోసం ప్రతీ సంవత్సరం యెరూషలేముకు వెళ్లేవాళ్లు.” (లూకా 2:41) వాళ్లు వాళ్ల కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలకే ఎక్కువ విలువ ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా నేడు తల్లిదండ్రులు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని మాటల ద్వారా ప్రవర్తన ద్వారా తమ పిల్లలు సరైన మార్గంలో వెళ్లేలా సహాయం చేయవచ్చు.—కీర్త 127:3-5.
వాళ్లు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:
-
జాన్, షారన్ షిల్లర్ వాళ్ల పిల్లలను పెంచుతున్నప్పుడు రాజ్యాసక్తులకే మొదటి స్థానం ఎలా ఇచ్చారు?
-
ప్రతి పిల్లవాని అవసరాలకు తగ్గట్లుగా తల్లిదండ్రులు వాళ్ల క్రమశిక్షణను ఎందుకు మార్చుకోవాలి?
-
విశ్వాసానికి వచ్చే పరీక్షల్ని తట్టుకోవడానికి తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని ఎలా సిద్ధం చేయవచ్చు?
-
మీ పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి యెహోవా సంస్థ ఇచ్చిన ఏ పరికరాల్ని మీరు ఉపయోగించారు?