మన క్రైస్తవ జీవితం
సోషల్ నెట్‌వర్క్ వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండండి
ఎందుకు ముఖ్యం: చాలా ఉపకరణాల్లాగే సోషల్ నెట్‌వర్క్ వల్ల కూడా లాభాలు లేదా నష్టాలు ఉన్నాయి. కొంతమంది సహోదరులు సోషల్ నెట్‌వర్క్‌లు ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు. ఇంకొంతమంది సహోదరులు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తారు. ఏదేమైనా మనం సోషల్ నెట్‌వర్క్‌లను ఆలోచన లేకుండా వాడి మనకున్న మంచి పేరును, ఆధ్యాత్మికతను పాడుచేసుకోవాలని అపవాది కోరుకుంటున్నాడు. యేసులా, దేవుని వాక్యంలో ఉన్న సూత్రాలను ఉపయోగించుకుని మనం ప్రమాదాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.—లూకా 4:4, 8, 12.
ప్రమాదాలకు దూరంగా ఉండండి:
-
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించకండి. లెక్కలేన్నన్ని గంటలను సోషల్ నెట్‌వర్క్‌లకు లేదా సోషల్ మీడియాలకు ఉపయోగిస్తుంటే యెహోవా సేవ చేయడానికి ఇవ్వాల్సిన విలువైన సమయం తగ్గిపోతుంది
బైబిలు సూత్రాలు: ఎఫె 5:15, 16; ఫిలి 1:10
-
చూడకూడని వాటిని చూడకండి. రెచ్చగొట్టే బొమ్మలను చూస్తే అశ్లీల చిత్రాలకు లేదా జారత్వానికి బానిసలు అవుతారు. మతభ్రష్టుల సమాచారాన్ని, బ్లాగులను చదివితే మన విశ్వాసం దెబ్బతింటుంది
బైబిలు సూత్రాలు: మత్త 5:28; ఫిలి 4:8
-
సరైనవి కాని కామెంట్స్‌ను లేదా ఫోటోలను అందరూ చూసేలా పోస్ట్ చేయకండి. మన హృదయం మోసకరమైనది కాబట్టి, సరైనవి కాని కామెంట్స్‌ను లేదా ఫోటోలను అందరూ చూసేలా సోషల్ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేయవచ్చు. అలాచేస్తే ఒకరి మంచి పేరు చెడిపోతుంది లేదా వాళ్ల విశ్వాసం బలహీన పడుతుంది
బైబిలు సూత్రాలు: రోమా 14:13; ఎఫె 4:29
సోషల్ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి అనే వీడియో చూడండి, తర్వాత ఈ సన్నివేశాల్లో ఎలా జాగ్రత్తగా ఉండవచ్చో ఆలోచించండి: