కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | గలతీయులు 4-6

మనకు ఉపయోగపడే “అలంకారిక అర్థం” ఉన్న ఉదాహరణ

మనకు ఉపయోగపడే “అలంకారిక అర్థం” ఉన్న ఉదాహరణ

4:24-31

ధర్మశాస్త్ర ఒప్పందం కన్నా కొత్త ఒప్పందం ఎలా గొప్పదో చూపించడానికి అపొస్తలుడైన పౌలు “అలంకారిక అర్థం” ఉన్న ఒక ఉదాహరణను ఉపయోగించాడు. క్రీస్తు, ఆయన తోటి వారసుల ప్రేమపూర్వక పర్యవేక్షణ కింద పాపం, అపరిపూర్ణత, బాధ, మరణం లేకుండా జీవించే అవకాశం మనుషులందరికీ ఉంది.—యెష 25:8, 9.

 

దాసురాలైన హాగరు

ఆమె, ధర్మశాస్త్ర ఒప్పందం కింద ఉన్న ఇశ్రాయేలును సూచిస్తుంది; వాళ్ల రాజధాని యెరూషలేము

స్వతంత్రురాలైన శారా

ఆమె, పైనున్న యెరూషలేమును, అంటే దేవుని సంస్థలోని పరలోక భాగాన్ని సూచిస్తుంది

హాగరు “పిల్లలు”

అంటే యూదులు (ధర్మశాస్త్ర ఒప్పందానికి కట్టుబడి ఉంటామని యెహోవాకు మాటిచ్చిన వాళ్లు), వాళ్లు యేసును హింసించి ఆయన్ని తిరస్కరించారు

శారా “పిల్లలు”

అంటే క్రీస్తు, అలాగే పవిత్రశక్తితో అభిషేకించబడిన 1,44,000 మంది క్రైస్తవులు

ధర్మశాస్త్ర ఒప్పందం దాసుల్ని చేస్తుంది

ఇశ్రాయేలీయులు పాపానికి దాసులుగా ఉన్నారని ధర్మశాస్త్రం వాళ్లకు గుర్తుచేసింది

కొత్త ఒప్పందం స్వతంత్రుల్ని చేస్తుంది

క్రీస్తు బలి విలువ మీద విశ్వాసం, ధర్మశాస్త్రం విధించిన శిక్ష నుండి స్వతంత్రుల్ని చేసింది