మన క్రైస్తవ జీవితం
అనుభవంగల క్రైస్తవుల నుండి ఏం నేర్చుకోవచ్చు?
మన సంఘాల్లో ఎన్నో ఏళ్లుగా యెహోవాను సేవిస్తున్నవాళ్లు ఉన్నారు. వాళ్లు యెహోవా మీద ఆధారపడిన విధానం నుండి మనం నేర్చుకోవచ్చు. వాళ్లు ఎదుర్కొన్న సవాళ్ల గురించి, యెహోవా సహాయంతో వాటిని అధిగమించడం గురించి, యెహోవా సంస్థ చరిత్ర గురించి మనం వాళ్లను అడగవచ్చు. కావాలంటే వాళ్లలో ఒకర్ని మన కుటుంబ ఆరాధనకు ఆహ్వానించి వాళ్ల అనుభవాలు తెలుసుకోవచ్చు.
మీరు అనుభవంగల క్రైస్తవులైతే, మీ విశ్వాసాన్ని యౌవనులతో మనసారా పంచుకోండి. యాకోబు, యోసేపు తమ అనుభవాల్ని తమ పిల్లలతో పంచుకున్నారు. (ఆది 48:21, 22; 50:24, 25) కొంతకాలం తర్వాత కుటుంబ పెద్దలు తన శక్తివంతమైన కార్యాల గురించి పిల్లలకు బోధించాలని యెహోవా కోరాడు. (ద్వితీ 4:9, 10; కీర్త 78:4-7) నేడు తల్లిదండ్రులు, సంఘంలో ఉన్న ఇతరులు, యెహోవా తన సంస్థ ద్వారా చేసిన ఏ అద్భుతమైన పనుల్ని కళ్లారా చూశారో యౌవనులకు చెప్పవచ్చు.
నిషేధం ఉన్నా ఐక్యతను కాపాడుకోవడం వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
నిషేధం ఉన్న కొన్ని దేశాల్లోని సహోదరులకు ఆస్ట్రియా బ్రాంచి ఎలా సహాయం చేసింది?
-
ఆ దేశాల్లోని సహోదరులు తమ విశ్వాసాన్ని ఎలా బలంగా ఉంచుకున్నారు?
-
రుమేనియాలో చాలామంది ప్రచారకులు యెహోవా సంస్థను ఎందుకు విడిచిపెట్టి వెళ్లారు? వాళ్లు ఎలా తిరిగొచ్చారు?
-
ఈ అనుభవాలు మీ విశ్వాసాన్ని ఎలా బలపరుస్తున్నాయి?