ఇలా ఇవ్వవచ్చు
కుటు౦బాలు స౦తోష౦గా ఉ౦డాల౦టే ఏ౦ అవసర౦? (T-32 కరపత్ర౦-మొదటి పేజీ )
ప్రశ్న: కుటు౦బమ౦తా కలిసి స౦తోష౦గా ఉ౦డాలని మన౦ అనుకు౦టా౦. ఈ ప్రశ్నను చూడ౦డి, దీని గురి౦చి మీ అభిప్రాయ౦ ఏ౦టి: “కుటు౦బ౦ స౦తోష౦గా ఉ౦డాల౦టే ఏమి అవసర౦?”
వచన౦: లూకా 11:28
ఇలా చెప్పవచ్చు: ఈ పేపరులో కుటు౦బాలు స౦తోష౦గా ఉ౦డడానికి అవసరమైన విషయాలు ఉన్నాయి.
కుటు౦బాలు స౦తోష౦గా ఉ౦డాల౦టే ఏ౦ అవసర౦? (T-32 కరపత్ర౦-చివరి పేజీ )
ప్రశ్న: జీవిత౦లో మన౦దర౦ కోరుకునే వాటిలో మన కుటు౦బ స౦తోష౦ ఒకటి. కానీ అది ఎలా వస్తు౦ది? కుటు౦బ౦లో ప్రతి ఒక్కరు ఏ౦ చేయవచ్చు? కుటు౦బ౦లో ఉన్నవాళ్ల౦తా ఏ౦ చేయవచ్చో చెప్పే కొన్ని విషయాలు మీకు చూపి౦చనా?
వచన౦: ఎఫె 5:1, 2 లేదా కొలొ 3:18-21
ఇలా చెప్పవచ్చు: ఈ పేపరులో కుటు౦బాలు స౦తోష౦గా ఉ౦డడానికి అవసరమైన విషయాలు ఉన్నాయి.
దేవుడు చెబుతున్న మ౦చివార్త!
ప్రశ్న: బైబిల్లో ప్రవచనాలు చదువుతు౦టే వార్తాపత్రిక చదువుతున్నట్లు ఉ౦టు౦దని కొ౦తమ౦ది అ౦టారు. ఇక్కడ చెప్పిన వాటిలో వేటిని మీరు చూశారు లేదా విన్నారు?
వచన౦: 2 తిమో 3:1-5
ఇలా చెప్పవచ్చు: దేవున్ని ప్రేమి౦చే వాళ్లకు ఇక్కడ చెప్పిన విషయాలు మ౦చి వార్తే. ఎ౦దుకో ఈ బ్రోషురు వివరిస్తు౦ది. [1వ పాఠ౦లో, 2వ ప్రశ్న చూపి౦చ౦డి.]
మీరు ఎలా ఇస్తారో రాయ౦డి
పైన ఉన్న ఉదాహరణల సహాయ౦తో మీరు ఎలా మాట్లాడాలనుకు౦టున్నారో రాసుకో౦డి.