మన క్రైస్తవ జీవితం
ధైర్యంగా ఉండడం సాధ్యమే
ధైర్యం అంటే బలంగా, స్థిరంగా, నిబ్బరంగా ఉండడం. ధైర్యంగా ఉండడమంటే అస్సలు భయపడకుండా ఉండడమని కాదు; భయమేసినా ముందుకు వెళ్లడం. నిజమైన ధైర్యానికి మూలమైన యెహోవా మీద ఆధారపడితే మనం ధైర్యంగా ఉండగలం. (కీర్త 28:7) యౌవనులు ధైర్యాన్ని ఎలా చూపించవచ్చు?
పిరికివాళ్లను కాదు, ధైర్యవంతులను అనుకరించండి! వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
ఎలాంటి సందర్భాల్లో యౌవనులకు ధైర్యం అవసరం?
-
ఏ బైబిలు ఉదాహరణలు మనలో ధైర్యాన్ని నింపుతాయి?
-
మనం ధైర్యం చూపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతాం? మనల్ని చూసి ఇతరులు ఎలా ప్రయోజనం పొందుతారు?