కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను అక్కచెల్లెళ్లుగా భావించండి

వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను అక్కచెల్లెళ్లుగా భావించండి

సంఘంలో ఉన్న వృద్ధ క్రైస్తవుల్ని మన తల్లులుగా, తండ్రులుగా; యౌవనుల్ని అక్కచెల్లెళ్లుగా, అన్నదమ్ములుగా భావించాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి. (1 తిమోతి 5:1, 2 చదవండి.) ముఖ్యంగా సహోదరులు, సహోదరీలతో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాలి.

సహోదరులెవ్వరూ సహోదరీలతో అతిచనువుగా లేదా వాళ్లు ఇబ్బందిపడేలా ప్రవర్తించకూడదు. (యోబు 31:1) ఒక పెళ్లికాని సహోదరునికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు, అతను ఎవరైనా సహోదరితో చనువుగా ప్రవర్తించకూడదు, ఆమెలో అనవసరమైన ఆశలు పెంచకూడదు.

సహోదరీలు గౌరవపూర్వకంగా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, లేదా ఏదైనా ముఖ్యమైన విషయాన్ని చెప్పినప్పుడు సంఘపెద్దలు వాళ్లను దయతో పట్టించుకోవాలి. మరిముఖ్యంగా, భర్తలేని స్త్రీల పట్ల పెద్దలు ఎక్కువ శ్రద్ధ చూపించాలి.—రూతు 2:8, 9.

సంఘంలో ప్రేమ చూపిస్తూ ఉండండి—విధవరాళ్ల మీద, తండ్రిలేనివాళ్ల మీద వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • మింట్‌ అనే సహోదరి మీద ఆమె సంఘంలోని వాళ్లు ఎలా ప్రేమ చూపించారు?

  • సహోదరసహోదరీలు చూపించిన ప్రేమ ఆ ఊరిలోని వాళ్లమీద ఎలాంటి ప్రభావం చూపించింది?

  • సంఘంలోని వాళ్లు చూపించిన ప్రేమ ఆ సహోదరి కూతుళ్లపై ఎలాంటి ప్రభావం చూపించింది?

మీ సంఘంలోని సహోదరీల పట్ల మీరు ప్రేమను, శ్రద్ధను ఏయే విధాలుగా చూపించవచ్చు?