కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

సహానుభూతి చూపించండి

సహానుభూతి చూపించండి

సహానుభూతి అంటే ఇతరుల ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను, అవసరాలను అర్థంచేసుకోవడం. మనం సహానుభూతి చూపించినప్పుడు దాన్ని ప్రజలు గ్రహిస్తారు. మనలో సహాయం చేయాలనే కోరిక ఉన్నప్పుడే ఇతరులపై సహానుభూతి చూపించగలుగుతాం. పరిచర్యలో సహానుభూతి చూపించినప్పుడు ప్రజలు యెహోవా ప్రేమను, శ్రద్ధను రుచిచూస్తారు. అప్పుడు ఆయన గురించి తెలుసుకోవడానికి వాళ్లు ఇష్టపడతారు.—ఫిలి 2:4.

అయితే మనం కేవలం బోధించేటప్పుడే కాదు, ఇంటివ్యక్తి చెప్పేది వినడం ద్వారా, మనం మాట్లాడుతున్నప్పుడు మన ప్రవర్తన-హావభావాల ద్వారా కూడా సహానుభూతి చూపిస్తాం. ఆ విధంగా మనకు వాళ్లపై నిజమైన శ్రద్ధ ఉందని రుజువుచేస్తాం. అంతేకాదు వాళ్ల ఇష్టాయిష్టాలను, నమ్మకాలను, పరిస్థితులను కూడా అర్థం చేసుకుంటాం. మనం వాళ్లకు అవసరమైన విషయాలను చెప్తూ సహాయం చేస్తామే గానీ, మారమని వాళ్లను ఒత్తిడి చేయం. వాళ్లు మన సహాయాన్ని అంగీకరించి జీవితంలో మార్పులు చేసుకున్నప్పుడు, మన పరిచర్యలో మరింత ఆనందాన్ని పొందుతాం.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—పరిచర్యలో మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—సహానుభూతి చూపించడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • జాస్మిన్‌ లేటుగా వచ్చినప్పుడు నీతా ఎలా సహానుభూతి చూపించింది?

  • స్టడీ తీసుకోవడానికి ఓపిక లేదని జాస్మిన్‌ చెప్పినప్పుడు, నీతా ఎలా సహానుభూతి చూపించింది?

  • మనం సహానుభూతి చూపించినప్పుడు ప్రజలు యెహోవాకు దగ్గరౌతారు

    పనులు పద్ధతి ప్రకారం చేసుకునే అలవాటు తనకు లేదని జాస్మిన్‌ చెప్పినప్పుడు, నీతా ఎలా సహానుభూతి చూపించింది?