మన క్రైస్తవ జీవితం
స్టడీలు ప్రారంభించడానికి సెప్టెంబరు నెలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం
సెప్టెంబరు నెలలో, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషుర్ ఉపయోగించి వీలైనంత ఎక్కువ మందితో స్టడీలు మొదలుపెట్టడానికి కృషి చేద్దాం. ఆ నెలలో సహాయ పయినీరు సేవ చేసేవాళ్లు 30 గంటలు కూడా చేయవచ్చు. ఈ ప్రచార కార్యక్రమాన్ని మనం ఎలా చేయాలి?
-
మొదటిసారి కలిసినప్పుడు: ఇంటివ్యక్తి మీద శ్రద్ధ చూపిస్తూ నైపుణ్యంగా, సహజంగా సంభాషణ మొదలుపెట్టండి, దాన్ని కొనసాగించండి. (ఫిలి 2:4) అలా చాలాసార్లు మాట్లాడిన తర్వాత, నెమ్మదిగా బైబిలు విషయాల గురించి మాట్లాడండి. ఒకవేళ ఇంటివ్యక్తికి నిజమైన ఆసక్తి ఉండి, ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడితే బైబిలు స్టడీ గురించి చెప్పండి. మీ రిటన్ విజిట్ వాళ్లతో పాటు ఒకప్పుడు ఆసక్తి చూపించిన వాళ్లతో కూడా మాట్లాడండి. ఎందుకంటే, అంతకుముందు వాళ్లు స్టడీ తీసుకోవడానికి ఇష్టపడకపోయినా ఇప్పుడు మనం వాడుతున్న కొత్త బ్రోషుర్, కొత్త పద్ధతి వాళ్లకు నచ్చవచ్చు. తాళం వేసివున్న ఇళ్ల దగ్గర ఈ బ్రోషురును పెట్టకండి. ఒకప్పుడు ఆసక్తి చూపించని వాళ్లకు ఉత్తరం పంపిస్తున్నప్పుడు కూడా ఈ బ్రోషుర్‌ను జతచేయకండి. సంఘ సేవా కమిటీ, సెప్టెంబరులో మిగతా నెలల కన్నా ఎక్కువసార్లు క్షేత్ర సేవ కూటాలను ఏర్పాటు చేయవచ్చు.
-
వేరే సమయాల్లో: మీ సంఘం కార్టులు ఉపయోగించి బహిరంగ సాక్ష్యం చేస్తుంటే, అందులో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషుర్ కూడా పెట్టండి. దాన్ని తీసుకునే వాళ్లకు స్టడీ ఏర్పాటు గురించి కూడా చెప్పండి. సేవా పర్యవేక్షకుడు నైపుణ్యంగల ప్రచారకుల్ని, వ్యాపార క్షేత్రాల్లో ప్రీచింగ్ చేయడానికి నియమించవచ్చు. మీ తోటి ఉద్యోగస్థులు, అనుకోకుండా కలిసిన వాళ్లు నిజంగా ఆసక్తి చూపిస్తే వాళ్లతో కూడా స్టడీలు మొదలుపెట్టడానికి ప్రయత్నించవచ్చు.
ప్రజలకు బోధిస్తూ వాళ్లను ‘శిష్యుల్ని చేయమని’ యేసు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. (మత్త 28:19, 20) ఆ ఆజ్ఞను పాటించడానికి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషుర్ ఉపయోగించి చేస్తున్న ఈ ప్రచార కార్యక్రమం సహాయపడుతుందని ఆశిస్తున్నాం.