మన క్రైస్తవ జీవితం
మీ ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిస్తున్నాడో గుర్తిస్తున్నారా?
ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చిన ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుని సేవకులు ప్రార్థనలో తమ సమస్యల్ని యెహోవాకు చెప్పుకున్నప్పుడు, ఆయన వాటిని విని సహాయం చేశాడు. ఆ అనుభవాలు వాళ్ల విశ్వాసాన్ని ఖచ్చితంగా బలపర్చి ఉంటాయి. కాబట్టి ప్రార్థనలో మన సమస్య ఏంటో యెహోవాకు వివరంగా చెప్పి, ఆయన ఇచ్చే జవాబు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే, ఆయనిచ్చే జవాబు మనం అనుకున్న దానికన్నా వేరుగా ఉండవచ్చు; లేదా మనం అడిగిన దానికన్నా ఆయన ఎక్కువ ఇవ్వవచ్చని గుర్తుంచుకోవాలి. (2కొ 12:7-9; ఎఫె 3:20) మన ప్రార్థనలకు జవాబుగా యెహోవా మనకు ఏం ఇవ్వవచ్చు?
-
మనల్ని బాధపెడుతున్న సమస్యను తట్టుకునే శక్తిని, మనశ్శాంతిని, విశ్వాసాన్ని ఆయన ఇవ్వవచ్చు.—ఫిలి 4:13
-
సరైన నిర్ణయం తీసుకునేలా తెలివిని ఇవ్వవచ్చు.—యాకో 1:5
-
తనకు ఇష్టమైనవి చేయాలనే కోరికను, శక్తిని ఇవ్వవచ్చు.—ఫిలి 2:13
-
ఆందోళనలో ఉన్నప్పుడు మనశ్శాంతిని ఇవ్వవచ్చు.—ఫిలి 4:6, 7
-
మనకు కావాల్సిన సహాయాన్ని, ఓదార్పును, ప్రోత్సాహాన్ని వేరేవాళ్ల ద్వారా ఇవ్వవచ్చు.—1యో 3:17, 18
-
మనం ఎవరి కోసమైతే ప్రార్థించామో వాళ్లకు ఆయన సహాయం చేయవచ్చు.—అపొ 12:5, 11
యెహోవా “ప్రార్థనలు వినే” దేవుడు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
అనారోగ్యం కారణంగా మనం ఇంతకుముందులా సేవ చేయలేకపోతే, సహోదరుడు షిమిజు అనుభవం మనకు ఎలా ప్రోత్సాహాన్నిస్తుంది?
-
ఆయనలా మనం కూడా ఏం చేయవచ్చు?