దేవుని వాక్యంలో ఉన్న సంపద
తెలివి విలువైనది
తెలివి ఇవ్వమని సొలొమోను యెహోవాను అడిగాడు (1రా 3:7-9; w11 12⁄15 8-9 పేజీలు, 4-6 పేరాలు)
సొలొమోను అలా అడిగినందుకు యెహోవా సంతోషపడ్డాడు (1రా 3:10-13)
సొలొమోను దేవుడిచ్చిన తెలివి మీద ఆధారపడడం వల్ల ఆయన పరిపాలనలో ప్రజలు సురక్షితంగా జీవించారు (1రా 4:25)
తెలివిగల వ్యక్తి ఒక విషయానికి సంబంధించిన వాస్తవాలన్నిటినీ తెలుసుకుంటాడు, వాటిని బాగా అర్థంచేసుకుంటాడు, ఆ తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. బంగారం కన్నా తెలివి చాలా విలువైనదని బైబిలు చెప్తుంది. (సామె 16:16) తెలివి కావాలంటే యెహోవాను అడుగుతూ ఉండాలి, ఆయనకు భయపడాలి, వినయం అణకువ కలిగివుండాలి, బైబిల్ని లోతుగా చదువుతూ ఉండాలి.