మన క్రైస్తవ జీవితం
ఇలా మాట్లాడవచ్చు భాగాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని సహోదరులు ఎంతో ఆలోచించి తయారు చేస్తున్నారు. దాన్ని ఉపయోగించి పరిచర్యలో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలు మంచిగా స్పందిస్తున్నారని చాలామంది ప్రచారకులు చెప్పారు. అయితే ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి, కాబట్టి ప్రచారకులు ప్రీచింగ్ చేస్తున్నప్పుడు తమ ప్రాంతంలోని ప్రజలకు నచ్చే అంశాలను ఎంచుకొని సంభాషణ మొదలుపెట్టవచ్చు. అయితే ప్రత్యేక ప్రచార కార్యక్రమం సమయంలో వచ్చే నిర్దేశాల్ని అందరూ ఒకేలా పాటించాలి. దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడమే మన లక్ష్యం. దాన్ని చేరుకున్నప్పుడే యేసు మనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తాం.—మత్త 24:14.
విద్యార్థి నియామకాలు చేస్తున్నప్పుడు మాత్రం “ఇలా మాట్లాడవచ్చు” భాగంలో ఉన్న అంశాన్నే ప్రచారకులు ఉపయోగించాలి. ఒకవేళ ఖచ్చితమైన సూచన ఏమీ లేకపోతే మీ ప్రాంతంలోని ప్రజలకు సరిపోయే ప్రశ్నను, లేఖనాన్ని, రిటన్ విజిట్ ప్రశ్నను, సన్నివేశాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇది జూన్ 2020 మీటింగ్ వర్క్‌బుక్, 8వ పేజీలో వచ్చిన నిర్దేశానికి సవరణ.