కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీ కుటుంబ సంతోషం మీ చేతుల్లోనే . . .

మీ కుటుంబ సంతోషం మీ చేతుల్లోనే . . .

కుటుంబం, సంతోషానికి చిరునామాలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త 127:3-5; ప్రస 9:9; 11:9) అయితే, లోకంలో ఉన్న ఒత్తిళ్ల వల్ల, కుటుంబ సభ్యులు చేసే పొరపాట్ల వల్ల ఆ సంతోషం ఆవిరైపోవచ్చు. అలా అవ్వకూడదంటే అది మీ చేతుల్లోనే ఉంది. కుటుంబ సంతోషం కోసం కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏం చేయవచ్చు?

భర్త తన భార్యను గౌరవించాలి. (1పే 3:7) ఆమెతో సమయం గడపాలి. ఆమె చేయలేని వాటిని ఆమె నుండి ఆశించకూడదు; భర్త కోసం, కుటుంబం కోసం ఆమె చేసినవాటికి కృతజ్ఞత చూపించాలి. (కొలొ 3:15) ఆమె మీద ఉన్న ప్రేమను చేతల్లో చూపించాలి, ఆమెను మెచ్చుకోవాలి.—సామె 31:28, 31.

భార్య తన భర్తకు అండగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలి. (సామె 31:12) ఆయన మాట వినాలి, సహకరించాలి. (కొలొ 3:18) ఆయనతో దయగా మాట్లాడాలి; ఆయన గురించి వేరేవాళ్ల దగ్గర మంచిగా మాట్లాడాలి.—సామె 31:26.

తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి. (ద్వితీ 6:6, 7) వాళ్లను ఎంత ప్రేమిస్తున్నారో మాటల్లో చెప్పాలి. (మత్త 3:17) క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు ప్రేమ, వివేచన చూపించాలి.—ఎఫె 6:4.

పిల్లలు అమ్మానాన్నల మాట వినాలి, వాళ్లను గౌరవించాలి. (సామె 23:22) వాళ్ల ఆలోచనల్ని, ఫీలింగ్స్‌ని అమ్మానాన్నలకు చెప్పుకోవాలి. అమ్మానాన్నలు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుని వాళ్లను గౌరవించాలి.—సామె 19:20.

మీ కుటుంబంలో ఆనందాన్ని పెంపొందించుకోండి వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

కుటుంబ సంతోషం కోసం కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏం చేశారు?