కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

కొత్త సేవా సంవత్సరం కోసం మీరు ఏ లక్ష్యాలు పెట్టుకున్నారు?

కొత్త సేవా సంవత్సరం కోసం మీరు ఏ లక్ష్యాలు పెట్టుకున్నారు?

ఆధ్యాత్మిక లక్ష్యాలు అంటే ఏంటి? యెహోవా సేవ ఎక్కువ చేయడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి మనం చేయాలనుకునేవి ఏవైనా ఆధ్యాత్మిక లక్ష్యాలే. మరిన్ని క్రైస్తవ లక్షణాలు పెంచుకోవడానికి అవి సహాయం చేస్తాయి; వాటికోసం మనం వెచ్చించే సమయం, శక్తి విలువైనది. (1తి 4:15) మన లక్ష్యాలేంటో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. గతంలో పెట్టుకున్న లక్ష్యం ప్రస్తుతం మన పరిస్థితులకు సరిపోకపోవచ్చు; లేదా దాన్ని ఇప్పటికే చేరుకొని ఉంటే, ఇంకొక లక్ష్యం పెట్టుకోవచ్చు.

లక్ష్యాల్ని పరిశీలించుకోవడానికి మంచి సమయం ఏంటి? కొత్త సేవా సంవత్సరం మొదలవ్వడానికి ముందున్న సమయమే. కుటుంబ ఆరాధనలో దీని గురించి మాట్లాడుకుని కుటుంబంగా, వ్యక్తిగతంగా మీరు పెట్టుకోగల లక్ష్యాలు ఏంటో ఆలోచించండి.

ఈ విషయాల్లో మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి? వాటిని చేరుకోవడానికి ఏం చేయాలనుకుంటున్నారు?

బైబిలు చదవడం, వ్యక్తిగత అధ్యయనం, కూటాలకు రావడం, కామెంట్స్‌ చెప్పడం.—w02 6⁄15 15వ పేజీ, 14-15 పేరాలు

ప్రీచింగ్‌.—w23.05 27వ పేజీ, 4-5 పేరాలు

క్రైస్తవ లక్షణాలు పెంచుకోవడం.—w22.04 23వ పేజీ, 5-6 పేరాలు

ఇంకేవైనా: