మన క్రైస్తవ జీవితం
దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి సెప్టెంబరులో ప్రత్యేక ప్రచార కార్యక్రమం!
మనుషుల సమస్యలకు ఏకైక పరిష్కారం దేవుని రాజ్యమేనని ప్రకటించడానికి మనం సెప్టెంబరు నెలలో ప్రత్యేకంగా కృషిచేస్తాం. (మత్త 24:14) ఇందులో పాల్గొనడానికి మీరేం చేయవచ్చు? దేవుని రాజ్యం గురించి చెప్పే లేఖనాన్ని ఈ నెలలో వీలైనంత ఎక్కువమందికి చదివి వినిపించండి. ఎవరైనా ఆసక్తి చూపిస్తే, కావలికోట No. 2 2020 సార్వజనిక పత్రిక కాపీని ఇవ్వండి. వీలైనంత త్వరగా మళ్లీ కలిసి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు నుండి స్టడీ ప్రారంభించడానికి ప్రయత్నించండి. సెప్టెంబరు నెలలో సహాయ పయినీరు చేసే వాళ్లందరూ 15 గంటలైనా చేయవచ్చు లేదా 30 గంటలైనా చేయవచ్చు.
అతిత్వరలో దేవుని రాజ్యం దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేస్తుంది. (దాని 2:44; 1కొ 15:24, 25) ఈ ప్రత్యేక అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని యెహోవాకు, ఆయన రాజ్యానికి మద్దతిస్తున్నామని చూపిద్దాం!