కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మనకోసం వాళ్లు కష్టపడి పనిచేస్తున్నారు

మనకోసం వాళ్లు కష్టపడి పనిచేస్తున్నారు

ప్రాంతీయ పర్యవేక్షకులు, వాళ్ల భార్యలు సహోదరసహోదరీల్ని ప్రేమిస్తారు, వాళ్లకు సేవచేయడానికి త్యాగాలు చేస్తారు. మనందరిలాగే వాళ్లకు కూడా వ్యక్తిగత పనులు ఉంటాయి; అప్పుడప్పుడు అలసిపోతారు, నిరుత్సాహపడతారు, ఆందోళనపడతారు. (యాకో 5:17) అయినాసరే ప్రతీవారం వేర్వేరు సంఘాలకు వెళ్తూ, అక్కడి సహోదరసహోదరీల్ని ప్రోత్సహించడం మీద మనసుపెడతారు. నిజంగానే ప్రాంతీయ పర్యవేక్షకులు “రెట్టింపు గౌరవానికి అర్హులు.”—1తి 5:17.

అపొస్తలుడైన పౌలు “దేవునికి సంబంధించిన ఏదైనా వరాన్ని” పంచుకోవాలనే ఉద్దేశంతో రోము సంఘానికి వెళ్లాలనుకున్నాడు. అంతేకాదు, అక్కడ ‘ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ప్రోత్సాహం పొందాలని’ కోరుకున్నాడు. (రోమా 1:11, 12) మీ ప్రాంతీయ పర్యవేక్షకుడిని, ఒకవేళ ఆయనకు పెళ్లై ఉంటే ఆయన భార్యను, ఎలా ప్రోత్సహించాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ప్రాంతీయ పర్యవేక్షకుని జీవితం వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ప్రాంతీయ పర్యవేక్షకులు, వాళ్ల భార్యలు సహోదరసహోదరీల మీద ప్రేమతో ఎలాంటి త్యాగాలు చేస్తారు?

  • వాళ్ల వల్ల మీరెలా ప్రయోజనం పొందారో మీ అనుభవం చెప్పండి.

  • వాళ్లను మనం ఎలా ప్రోత్సహించవచ్చు?