కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Kokkinakis v. Greece: Droit réservé

పైన ఎడమవైపు నుండి: వెస్ట్‌ వర్జీనియా రాష్ట్ర విద్యా విభాగం v. బార్నెట్‌; కోకినాకిస్‌ v. గ్రీస్‌; టగాన్‌రోగ్‌ LRO, ఇతరులు v. రష్యా; చా, ఇతరులు v. దక్షిణ కొరియా

మన క్రైస్తవ జీవితం

‘మంచివార్త తరఫున వాదించడం, చట్టబద్ధమైన హక్కును సంపాదించడం’

‘మంచివార్త తరఫున వాదించడం, చట్టబద్ధమైన హక్కును సంపాదించడం’

ఇశ్రాయేలీయులు ఆలయాన్ని తిరిగి కడుతున్నప్పుడు ఆ పనిని ఆపడానికి వ్యతిరేకులు ప్రయత్నించారు; అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమకున్న చట్టబద్ధమైన హక్కును కాపాడుకోవడానికి ఇశ్రాయేలీయులు శాయశక్తులా ప్రయత్నించారు. (ఎజ్రా 5:11-16) మంచివార్త ప్రకటించే విషయంలో తమకున్న చట్టబద్ధమైన హక్కును కాపాడుకోవడానికి క్రైస్తవులు కూడా అలానే కృషి చేస్తున్నారు. (ఫిలి 1:7) అందులో భాగంగా, 1936​లో ప్రపంచ ప్రధాన కార్యాలయంలో లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటైంది. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజ్య సంబంధమైన పనులకు ఆటంకం వచ్చినప్పుడు, వాటి తరఫున వాదించి ఆ పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఆ డిపార్ట్‌మెంట్‌ కృషిచేస్తుంది. ఇప్పటిదాకా ఆ డిపార్ట్‌మెంట్‌ రాజ్య సంబంధ పనులకు ఏ విధంగా మద్దతిచ్చి దేవుని ప్రజలకు సహాయపడింది?

ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ను చూసొద్దాం రండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • యెహోవాసాక్షులకు ఎలాంటి చట్టపరమైన సమస్యలు ఎదురయ్యాయి?

  • మనం ఎలాంటి కేసులు గెలిచాం? ఒక ఉదాహరణ చెప్పండి.

  • ‘మంచివార్త తరఫున వాదించి, చట్టబద్ధమైన హక్కును సంపాదించడానికి’ మనలో ప్రతీ ఒక్కరం ఎలా సహాయపడవచ్చు?

  • దేవుని ప్రజలకు సంబంధించిన చట్టపరమైన వార్తలు, మత నమ్మకాల కారణంగా జైల్లో ఉన్న యెహోవాసాక్షుల పేర్లు మన వెబ్‌సైట్‌లో ఎక్కడ ఉంటాయి?