జూలై 29–ఆగస్టు 4
కీర్తన 69
పాట 13, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. యేసు జీవితంలో జరిగిన సంఘటనల గురించి 69వ కీర్తనలో ముందే ఎలా చెప్పబడ్డాయి?
(10 నిమి.)
కారణం లేకుండా యేసును ద్వేషించారు (కీర్త 69:4; యోహా 15:24, 25; w11 8/15 11వ పేజీ, 17వ పేరా)
యెహోవా మందిరం విషయంలో యేసు ఆసక్తి చూపించాడు (కీర్త 69:9; యోహా 2:13-17; w10 12/15 8వ పేజీ, 7-8 పేరాలు)
యేసు ఎంతో వేదన అనుభవించాడు, ఆయనకు చేదు మొక్కలు కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చారు (కీర్త 69:20, 21; మత్త 27:34; లూకా 22:44; యోహా 19:34; g95-E 10/22 31వ పేజీ, 4వ పేరా; it-2-E 650వ పేజీ)
ధ్యానించడం కోసం: మెస్సీయ గురించిన ప్రవచనాల్ని హీబ్రూ లేఖనాల్లో యెహోవా ఎందుకు రాయించాడు?
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
కీర్త 69:30, 31—మనం ప్రార్థనలు ఇంకా చక్కగా చేయడానికి ఈ వచనాలు ఎలా సహాయం చేస్తాయి? (w99 1/15 18వ పేజీ, 11వ పేరా)
-
ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 69:1-25 (th 2వ అధ్యాయం)
4. ఓర్పు చూపించండి—యేసు ఏం చేశాడు?
(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 8వ పాఠంలో 1-2 పాయింట్స్ చర్చించండి.
5. ఓర్పు చూపించండి—యేసులా ఉందాం
(8 నిమి.) lmd 8వ పాఠంలో 3-5 పాయింట్స్ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.
పాట 134
6. స్థానిక అవసరాలు
(5 నిమి.)
7. కుటుంబ ఆరాధన కోసం సూత్రాలు
(10 నిమి.) చర్చ.
2009 జనవరిలో, సంఘ బైబిలు అధ్యయనం అనే మీటింగ్‌ని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలతో అలాగే సేవా కూటంతో కలిపారు. అప్పటినుండి మనకు వారం మధ్యలో ఒక్క మీటింగ్ మాత్రమే జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వారం-వారం కుటుంబాలు తమ అవసరాలకు తగ్గట్టు ఒక కార్యక్రమాన్ని తయారుచేసుకుని కుటుంబ ఆరాధన చేసుకోవడానికి అవకాశం దొరికింది. యెహోవాకు అలాగే కుటుంబంలో ఒకరికొకరు దగ్గరవ్వడానికి చేసిన ఈ ఏర్పాటును చాలామంది మెచ్చుకున్నారు.—ద్వితీ 6:6, 7.
కుటుంబ ఆరాధన విజయవంతం అవ్వాలంటే కుటుంబ పెద్దలకు సహాయం చేయగల కొన్ని సూత్రాలు ఏంటి?
-
క్రమంగా చేసుకోండి. వీలైతే, కుటుంబ ఆరాధన కోసం వారంలో ఒక ఖచ్చితమైన సమయం పెట్టుకోండి. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే అదే వారంలో వేరే ఏ రోజు చేసుకోవచ్చో ముందే ఆలోచించండి
-
సిద్ధపడండి. కుటుంబ ఆరాధనలో ఏం మాట్లాడుకోవాలో మీ భార్యను, అప్పుడప్పుడు మీ పిల్లల్ని అడగండి. కుటుంబ ఆరాధనను ప్రతీవారం ఒకేలా చేయడాన్ని ఇంట్లో అందరూ ఇష్టపడుతుంటే, దానికోసం గంటలు-గంటలు సిద్ధపడాల్సిన అవసరం లేదు
-
మీ కుటుంబానికి తగ్గట్టు చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్లు అవుతుండగా వాళ్ల సామర్థ్యాలు-అవసరాలు మారుతుంటాయి. కుటుంబంలో ఉన్న ప్రతీ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేసే విధంగా మీ కుటుంబ ఆరాధన ఉండేలా చూసుకోండి
-
ప్రేమ, ప్రశాంతత ఉండేలా చూసుకోండి. పరిస్థితులు అనుకూలిస్తే, కొన్నిసార్లు బయటికి వెళ్లి కుటుంబ ఆరాధన చేసుకోవచ్చు. కావాలంటే మధ్యలో బ్రేక్ కూడా తీసుకోవచ్చు. మీ పిల్లలకు ఎదురయ్యే సమస్యల గురించి కుటుంబ ఆరాధనలో మాట్లాడుకోవచ్చు కానీ ఆ సమయంలో క్రమశిక్షణ ఇవ్వడం గానీ, తిట్టడం గానీ చేయకూడదు
-
కొత్తగా ప్రయత్నించండి. ఉదాహరణకు, కుటుంబ ఆరాధనలో మీరు మీటింగ్స్‌కి ప్రిపేర్ అవ్వొచ్చు, jw.orgలో ఒక వీడియో చూసి దానిగురించి మాట్లాడుకోవచ్చు, ప్రీచింగ్‌కి సిద్ధపడొచ్చు. కుటుంబ ఆరాధనలో అందరూ కలిసి చర్చించుకోవడమే చాలా ప్రాముఖ్యం, అయితే ఆ సమయంలో వ్యక్తిగత అధ్యయనం కూడా చేయవచ్చు
ఈ ప్రశ్న అడగండి:
-
మీ కుటుంబ ఆరాధనలో ఈ సూత్రాల్ని ఎప్పుడైనా పాటించారా?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 13వ అధ్యాయంలో 8-16 పేరాలు, 105వ పేజీ బాక్సు