ఉదారంగా కొలిచి ఇవ్వండి
ఉదారంగా ఉండేవాళ్లు తమ సమయాన్ని, శక్తిని, వనరులను వేరేవాళ్లకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి ఇష్టంగా ఇస్తారు.
-
“ఇవ్వడం అలవాటు చేసుకోండి” అనే గ్రీకు క్రియ పదానికి ఎప్పుడూ చేస్తూ ఉండడం అనే భావం వస్తుంది
-
వేరేవాళ్లకు ఇచ్చే అలవాటు మనకు ఉంటే ఇతరులు కూడా మనకు ఇస్తారు. “వాళ్లు మంచి కొలతతో మీ ఒళ్లో పోస్తారు; వాటిని అదిమి, కుదిపి, పొర్లిపోయేంతగా పోస్తారు.” ఈ మాటలు మనకు కొంతమంది అమ్మేవాళ్ల పద్ధతిని గుర్తు చేస్తుంది. వాళ్లు, కొనేవాళ్ల ఒళ్లో లేదా పైచెంగులో కొన్న వస్తువుల్ని నిండుగా పోస్తూ ఉంటారు