యేసు శిష్యులు అవ్వాలంటే ఏమి చేయాలి?
పొలం దున్నుతున్నప్పుడు గాడులు వంకర పోకుండా తిన్నగా రావాలంటే దున్నే వాళ్ల అవధానం వెనకున్న వాటివైపుకు వెళ్లకూడదు. అలానే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో అతను వదిలేసిన విషయాల వల్ల తన అవధానం ప్రక్కకు వెళ్లకుండా చూసుకోవాలి.—ఫిలి 3:13.
మనకు కష్టాలు వచ్చినప్పుడు ‘పాతరోజులే బాగున్నాయి’ అని త్వరగా అనుకునే అవకాశం ఉంది. బహుశా కొన్నిసార్లు, సత్యంలోకి రాకముందు రోజులే బాగున్నాయి అని కూడా అనుకోవచ్చు. అలా అనుకుంటున్నప్పుడు అప్పట్లో ఉన్న కష్టాలను కాకుండా సంతోషాలను మనం ఎక్కువగా గుర్తుచేసుకోవచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వచ్చేశాక అదే చేశారు. (సంఖ్యా 11:5, 6) అలా ఆలోచిస్తే మన పాత జీవన విధానానికి వెళ్లిపోవాలనే కోరిక మనకు రావచ్చు. ప్రస్తుతం ఉన్న ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తూ, రాజ్యం ద్వారా రాబోయే ఆనందాల మీద మనసు పెట్టడం ఎంతో మంచిది.—2 కొరిం 4:16-18.