మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సరైన “హృదయ స్థితి” ఉన్నవాళ్లకు శిష్యులయ్యేలా సహాయం చేద్దాం
ఎందుకు ముఖ్యం: “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్ల హృదయాల్లో సత్యపు విత్తనాలు పెరిగేలా యెహోవాయే చేస్తాడు. (అపొ 13:48; 1 కొరిం 3:7) పరిచర్యలో కలిసిన వాళ్లలో, ఎవరైతే తాము నేర్చుకున్నవాటి ప్రకారం జీవించాలని అనుకుంటారో, వాళ్లమీద దృష్టి పెట్టడం ద్వారా, మనం యెహోవాతో కలిసి పనిచేస్తాం. (1 కొరిం 9:26) రక్షణ పొందడానికి క్రైస్తవ బాప్తిస్మం అవసరమని బైబిలు విద్యార్థులు అర్థం చేసుకోవాలి. (1 పేతు 3:21) వాళ్ల జీవితాల్లో మార్పులు చేసుకోవాలని, ప్రకటించి బోధించాలని అలాగే యెహోవాకు తమ జీవితాన్ని సమర్పించుకోవాలని నేర్పించడం ద్వారా, మనం వాళ్లకు శిష్యులు అవ్వడానికి సహాయం చేస్తాం.—మత్త 28:19, 20.
ఇలా చేయవచ్చు:
-
బైబిలు స్టడీ వెనకున్న ముఖ్య ఉద్దేశం యెహోవా గురించి ‘తెలుసుకోవడం’, ఆయన్ని సంతోషపెట్టడం అని బైబిలు విద్యార్థులకు గుర్తుచేయండి. —యోహా 17:3
-
చెడు అలవాట్లు, హానికరమైన సహవాసాలు లాంటి అడ్డంకుల్ని అధిగమించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా వాళ్లకు సహాయం చేయండి
-
బాప్తిస్మం తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత వాళ్లను బలపర్చి, ప్రోత్సహించండి.—అపొ 14:22
యెహోవా దేవుడు మీకు సహాయం చేస్తాడు అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
ఎలాంటి భయాలు ఉండడం వల్ల కొంతమంది సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడతారు?
-
బైబిలు విద్యార్థులు ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా పెద్దలు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?
-
యెషయా 41:10 యెహోవా గురించి మనకేమి నేర్పిస్తుంది?
-
మనం అపరిపూర్ణులమైనప్పటికీ, యెహోవా అంగీకరించేలా ఆయన్ని సేవించాలంటే మనకు ఎలాంటి లక్షణాలు సహాయం చేస్తాయి?