కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠పరిస్థితికి తగ్గట్టు మాట్లాడండి

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠పరిస్థితికి తగ్గట్టు మాట్లాడండి

ఎందుకు ప్రాముఖ్యం: అభిషిక్తులు, వేరేగొర్రెలు కలిసి ప్రజల్ని ‘ఉచితంగా జీవజలాలు తాగమని’ ఆహ్వానిస్తారు. (ప్రక 22:17) విధేయులైన మనుషుల్ని పాపమరణాల నుండి రక్షించడానికి యెహోవా చేసిన అన్ని ఏర్పాట్లను ఈ జీవజలాలు సూచిస్తున్నాయి. వేర్వేరు ఆచారాలు, మతనమ్మకాలు ఉన్న ప్రజలకు సహాయం చేయాలంటే, ‘శాశ్వతకాలం ఉండే మంచివార్తను’ వాళ్లలో ప్రతీఒక్కరికి నచ్చేలా చెప్పాలి.—ప్రక 14:6.

ఎలా చేయాలి:

  • మీ ప్రాంతంలో ఉన్న ప్రజల హృదయాల్ని హత్తుకునే అంశం, లేఖనం ఎంచుకోండి. ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న ఏదైనా అందింపును, లేదా మీరు ఇంతకుముందు మాట్లాడి మంచి ఫలితాలు సాధించిన ఏదైనా విషయాన్ని ఎంచుకోవచ్చు. మీ ప్రాంత ప్రజలకు ఎలాంటి అంశాలు, లేఖనాలు నచ్చుతాయి? ఈ మధ్య ప్రజలు ఏ విషయం గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు? మగవాళ్లు ఎలాంటి విషయాలు మాట్లాడడానికి ఇష్టపడతారు? ఆడవాళ్లు ఎలాంటి విషయాలు ఇష్టపడతారు?

  • మీ ప్రాంతంలో సాధారణంగా ఎలా పలకరిస్తారో అలా పలకరించండి, స్థానిక పద్ధతుల్ని పాటించండి.—2 కొరిం 6:3, 4

  • బోధనా పనిముట్లు విభాగంలో ఉన్న ప్రచురణల్ని చదవండి, వీడియోలు చూడండి. అప్పుడు మీరు, ఆసక్తి ఉన్నవాళ్లకు వాటిగురించి చెప్పగలుగుతారు

  • మీ ప్రాంతంలో ఏ భాషలు మాట్లాడే ప్రజలు కలుస్తారో ఆ భాషలో ఉన్న ప్రచురణలు, వీడియోలు డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోండి

  • ఇంటివ్యక్తి అవసరాలకు తగ్గట్టు మీరు మాట్లాడే విషయాన్ని మార్చుకోండి. (1 కొరిం 9:19-23) ఉదాహరణకు, ఇంటివ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈమధ్యే చనిపోయారని మాటల మధ్యలో తెలిస్తే మీరేం చేస్తారు?

వీడియో చూడండి, ఆ తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ప్రచారకుడు ఇంటివ్యక్తితో ఏ విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు?

  • ఇంటివ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు?

  • ఈ సందర్భంలో ఏ లేఖనం చూపిస్తే బాగుంటుంది, ఎందుకు?

  • మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నచ్చేలా మీ అందింపులో మీరు ఎలాంటి మార్పులు చేస్తుంటారు?