కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

భూమి “నదిని మింగేసింది”

భూమి “నదిని మింగేసింది”

చరిత్రంతటిలో, లోక అధికారులు యెహోవా ప్రజలకు సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. (ఎజ్రా 6:1-12; ఎస్తే 8:10-13) మనకాలంలో కూడా, “మహాసర్పం” అయిన సాతాను వెళ్లగక్కుతున్న హింస అనే “నదిని” “భూమి” మింగేయడం మనం గమనించాం. ఈ లోకంలో అధికారం, పలుకుబడి ఉన్న కొంతమంది వ్యక్తులను “భూమి” సూచిస్తుంది. (ప్రక 12:16) ‘పూర్ణరక్షణ కలుగజేసే దేవుడైన’ యెహోవా, తన ప్రజలకు సేదదీర్పు ఇవ్వడానికి కొన్నిసార్లు మానవ పరిపాలకుల్ని ఉపయోగించుకుంటాడు.—కీర్త 68:20; సామె 21:1.

మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని జైల్లో వేస్తే అప్పుడేంటి? యెహోవా మిమ్మల్ని గమనించట్లేదేమో అని ఎన్నడూ సందేహించకండి. (ఆది 39:21-23; కీర్త 105:17-20) మీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందుతారనే నమ్మకంతో ఉండండి. మీ యథార్థత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సహోదరులను ప్రోత్సహిస్తుంది. —ఫిలి 1:12-14; ప్రక 2:10.

కొరియాలోని సహోదరులు జైలు నుండి విడుదలయ్యారు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ఎన్నో ఏళ్లుగా, దక్షిణ కొరియాలోని వేలమంది సహోదరులు ఎందుకు జైల్లో వేయబడ్డారు?

  • మన సహోదరుల్లో కొంతమంది త్వరగా విడుదలవ్వడానికి ఏ కోర్టు తీర్పులు సహాయం చేశాయి?

  • ప్రపంచవ్యాప్తంగా, తమ విశ్వాసాన్ని బట్టి ప్రస్తుతం జైల్లో ఉన్న సహోదరులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?

  • మనకు ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవచ్చు?

  • న్యాయస్థానాల్లో మనం సాధించే విజయాలకు అసలు కారణం ఎవరు?

నాకున్న స్వేచ్ఛను నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను?