కుష్ఠు వ్యాధికి సంబంధించిన నియమాల నుండి పాఠాలు
కుష్ఠు వ్యాధి నియమాల వెనకున్న సూత్రాలు, మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి ఏ పాఠాలు నేర్పిస్తాయి?
-
ఆలస్యం కాకముందే కుష్ఠు వ్యాధిని ఎలా గుర్తించవచ్చో యెహోవా యాజకులకు నేర్పించాడు. నేడున్న క్రైస్తవ కాపరులు కూడా, ఆధ్యాత్మిక అవసరంలో ఉన్నవాళ్లకు ఆలస్యం కాకముందే సహాయం చేస్తారు.—యాకో 5:14, 15
-
కుష్ఠు సోకిన వస్తువులన్నిటినీ కాల్చేయాలని ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపించబడ్డారు; అలాచేయడం వల్ల ఆ వ్యాధి మిగతావాటికి సోకకుండా ఉంటుంది. క్రైస్తవులు కూడా, పాపం చేయడానికి నడిపించే దేన్నైనా, అదెంత విలువైనదైనా దాన్ని వదులుకోవాలి. (మత్త 18:8, 9) అలా వదులుకోవాల్సినవి అలవాట్లు కావచ్చు, స్నేహాలు కావచ్చు, లేదా వినోదం కావచ్చు
తాను యెహోవా సహాయం కావాలని కోరుకుంటున్నట్లు ఒక క్రైస్తవుడు ఎలా చూపించవచ్చు?