కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

పత్రికలు ఉపయోగిస్తూ ఉండండి

పత్రికలు ఉపయోగిస్తూ ఉండండి

2018 మొదలుకొని, ఒక్కో సార్వజనిక పత్రిక ఒక్కో అంశం గురించే చర్చిస్తుంది. ఈ పత్రికలన్నీ మన బోధనా పనిముట్లలో భాగమే. కాబట్టి మనం వాటిని పరిచర్యలో ఇవ్వవచ్చు. అంతేకాదు, ప్రయాణించేటప్పుడు లేదా షాపింగ్‌కి వెళ్లేటప్పుడు బ్యాగులో కొన్ని పెట్టుకోవచ్చు. ఈ పత్రికలను బైబిలు స్టడీ చేయడానికి వీలుగా తయారు చేయలేదు, అయితే దేవుని గురించి ఎక్కువ నేర్చుకోవాలనే కోరికను ఇంటివ్యక్తుల్లో కలిగించడానికి ఇవి సహాయం చేస్తాయి.

ఇంటివ్యక్తితో సంభాషణ మొదలుపెట్టాక ఒక లేఖనం చూపించండి, తర్వాత ఆ వ్యక్తికి ఆసక్తికరంగా అనిపించే పత్రికను ఇవ్వండి. ఉదాహరణకు ఇంటివ్యక్తికి పిల్లలు ఉంటే, లేదా బాధలో గానీ ఒత్తిడిలో గానీ ఉంటే మీరిలా అనవచ్చు: “ఈమధ్య దీనిగురించి ఒక ఆర్టికల్‌ చదివాను. అది మీకు చూపించనా?” ఇంటివ్యక్తికి ఆసక్తి ఉందని మీరు గమనిస్తే, ఆ పత్రిక ముద్రిత కాపీని గానీ, ఎలక్ట్రానిక్‌ కాపీని గానీ ఇవ్వండి. మీరు ఆ వ్యక్తిని కలవడం అదే మొదటిసారి అయినప్పటికీ పత్రికను ఇవ్వవచ్చు. నిజమే, మన ప్రధాన లక్ష్యం పత్రికల్ని పంచిపెట్టడం కాదు. అయితే, నేర్చుకున్నవాటి ప్రకారం జీవించాలనే కోరిక ఉన్నవాళ్లను కనుగొనడానికి పత్రికలు సహాయం చేస్తాయి.—అపొ 13:48.

2018

2019

2020

 

మీ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి విషయాలు చర్చించడానికి ఇష్టపడతారు?