ప్రాయశ్చిత్త రోజు నుండి మీరేం నేర్చుకోవచ్చు
ప్రాయశ్చిత్త రోజున ధూపద్రవ్యాన్ని ఉపయోగించడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
-
యెహోవా నమ్మకమైన సేవకులు చేసే ఆమోదయోగ్యమైన ప్రార్థనలు ధూపం లాంటివి. (కీర్త 141:2) ప్రధాన యాజకుడు ధూపద్రవ్యాన్ని చాలా గౌరవంతో యెహోవా ముందుకు తీసుకెళ్లినట్లే, మనం కూడా చాలా గౌరవంతో ఆయనకు ప్రార్థన చేస్తాం
-
ప్రధాన యాజకుడు బలులు అర్పించే ముందు ధూపద్రవ్యాన్ని వెలిగించేవాడు. అదేవిధంగా, యేసు తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి ముందు యథార్థంగా, నమ్మకంగా జీవించడం ద్వారా యెహోవాకు ఆమోదయోగ్యమైన బలి అర్పించడానికి మార్గం ఏర్పాటు చేశాడు
నేను అర్పించే బలులు యెహోవాకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?