కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీరు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారా?

మీరు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారా?

మీకు 23 నుండి 65 ఏళ్ల వయసు ఉండి పూర్తికాల సేవ చేస్తున్నారా? మీకు మంచి ఆరోగ్యం ఉందా? అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయాలనే కోరిక ఉందా? అయితే, రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లడం గురించి ఆలోచించారా? ఈ పాఠశాల మొదలైనప్పటి నుండి వేలమంది దంపతులు, పెళ్లికాని సహోదరులు, పెళ్లికాని సహోదరీలు అప్లికేషన్‌ పెట్టారు. అవసరం చాలా ఉంది కాబట్టి, ఇంకా ఎక్కువమంది పెళ్లికాని సహోదరులు అప్లికేషన్‌ పెట్టాలని ప్రోత్సహిస్తున్నాం. తనను సంతోషపెట్టాలనే, తన కుమారుడిని అనుకరించాలనే కోరికను మీలో పెంచమని యెహోవాను అడగండి. (కీర్త 40:8; మత్త 20:28; హెబ్రీ 10:7) అర్హత సాధించేందుకు వీలుగా ఉద్యోగపరమైన లేదా వ్యక్తిగత బాధ్యతల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ఈ పాఠశాల ద్వారా శిక్షణ పొందినవాళ్లు ఏయే పద్ధతుల్లో, ప్రాంతాల్లో సేవ చేయగలిగారు? కొందరు వేరే భాషా క్షేత్రాల్లో సేవచేస్తున్నారు, ఇంకొందరు ప్రత్యేక మెట్రోపాలిటన్‌ బహిరంగ సాక్ష్యంలో పాల్గొంటున్నారు. కొందరు సబ్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ పర్యవేక్షకులుగా, ప్రాంతీయ పర్యవేక్షకులుగా, ఫీల్డ్‌ మిషనరీలుగా సేవచేస్తున్నారు. యెహోవా సేవ ఎక్కువ చేయాలనుకుంటున్న మీరు, యెషయా ప్రవక్త అన్న ఈ మాటల్ని మనసులో ఉంచుకోండి: “నేనున్నాను! నన్ను పంపు!”—యెష 6:8.

కోతపని చేస్తున్న ఫీల్డ్‌ మిషనరీలు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • క్షేత్ర మిషనరీలను ఎలా ఎంపిక చేస్తారు?

  • ఫీల్డ్‌ మిషనరీలు ఎలాంటి చక్కని పని చేస్తున్నారు?

  • మిషనరీ సేవ చేయడం వల్ల పొందే దీవెనల్లో కొన్ని ఏంటి?