మన క్రైస్తవ జీవితం
యెహోవా ఇచ్చే క్రమశిక్షణకు మద్దతివ్వడం ద్వారా మనం ప్రేమ చూపిస్తాం
బహిష్కరణ ఏర్పాటు సంఘాన్ని కాపాడుతుంది, తప్పుచేసి పశ్చాత్తాపం చూపించనివాళ్లకు క్రమశిక్షణ ఇస్తుంది. (1కొ 5:6, 11) యెహోవా ఇచ్చే అలాంటి క్రమశిక్షణకు మద్దతివ్వడం ద్వారా మనం ప్రేమ చూపిస్తాం. ఎవరైనా బహిష్కరించబడినప్పుడు వాళ్ల దగ్గరి బంధువులు, న్యాయనిర్ణయ కమిటీలోని సహోదరులు చాలా మానసిక వేదనకు గురౌతారు. మరి, బాధ కలిగించే ఇలాంటి క్రమశిక్షణకు మద్దతిస్తే ప్రేమ చూపించినట్టు ఎలా అవుతుంది?
అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా పేరును పాడు చేయకుండా ఉండడం ద్వారా, ఆయన పవిత్రంగా ఎంచేవాటిని గౌరవించడం ద్వారా మనం ప్రేమ చూపించిన వాళ్లమౌతాం. (1పే 1:14-16) బహిష్కరించబడిన వ్యక్తి మీద కూడా మనం ప్రేమ చూపించినవాళ్లమౌతాం. ఎందుకంటే క్రమశిక్షణ బాధ కలిగించినప్పటికీ, అది “నీతి అనే శాంతికరమైన ఫలాన్ని ఇస్తుంది.” (హెబ్రీ 12:5, 6, 11) బహిష్కరించబడిన వ్యక్తితో లేదా కావాలని యెహోవాకు దూరమైన వ్యక్తితో మనం సహవసిస్తే, యెహోవా ఇచ్చే క్రమశిక్షణను అడ్డుకున్న వాళ్లమౌతాం. యెహోవా తన ప్రజలకు “తగిన మోతాదులో” క్రమశిక్షణ ఇస్తాడని గుర్తుంచుకోండి. (యిర్మీ 30:11) బహిష్కరించబడిన వ్యక్తి మన కరుణగల తండ్రి దగ్గరికి తిరిగొస్తాడని మనం ఎదురుచూస్తాం. అదే సమయంలో, యెహోవా ఇచ్చే క్రమశిక్షణకు మనం మద్దతిస్తాం, యెహోవాతో మనకున్న స్నేహాన్ని బలంగా ఉంచుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తాం.—యెష 1:16-18; 55:7.
పూర్తి హృదయంతో విశ్వసనీయత చూపించండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
పిల్లలు యెహోవాకు దూరమైనప్పుడు తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంది?
-
బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సంఘంలోనివాళ్లు ఎలా మద్దతివ్వవచ్చు?
-
కుటుంబానికి విశ్వసనీయంగా ఉండడంకన్నా యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం ముఖ్యమని ఏ బైబిలు ఉదాహరణ చూపిస్తుంది?
-
కుటుంబం కన్నా యెహోవాకే ఎక్కువ విశ్వసనీయంగా ఉన్నామని మనం ఎలా చూపించవచ్చు?