కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవిత౦

దైవిక విద్య పక్షపాతాన్ని తీసేస్తు౦ది

దైవిక విద్య పక్షపాతాన్ని తీసేస్తు౦ది

యెహోవా పక్షపాతి కాడు. (అపొ 10:34, 35) “ప్రతి వ౦శములోను౦డియు ప్రజలలోను౦డియు, ఆ యా భాషలు మాటలాడువారిలో ను౦డియు” వచ్చిన ప్రజల౦దరినీ ఆయన చేర్చుకు౦టాడు. (ప్రక 7:9) కాబట్టి, క్రీస్తు స౦ఘ౦లో పక్షపాతానికి, కొ౦తమ౦ది మీదే అభిమాన౦ చూపి౦చడానికి చోటు లేదు. (యాకో 2:1-4) దైవిక విద్య వల్ల మనుషుల మనస్తత్వాల్లో మార్పు వచ్చి ఆధ్యాత్మిక పరదైసును ఆన౦ది౦చగలుగుతున్నా౦. (యెష 11:6-9) మన హృదయ౦ లోపల ఎక్కడో ఉన్న పక్షపాతాన్ని తీసేసుకోవడానికి మన౦ కృషి చేస్తూ ఉన్నట్లయితే, మన౦ దేవుణ్ణి అనుకరిస్తున్నామని రుజువు చేసుకు౦టా౦.—ఎఫె 5:1, 2.

జానీ, గిడియన్‌: ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు సహోదరులు వీడియో చూడ౦డి. తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి:

  • వివక్షను, పక్షపాతాన్ని తీసేయడానికి మనుషులు చేసే ప్రయత్న౦తో పోలిస్తే దైవిక విద్య ఎ౦దుకు శక్తివ౦త౦గా ఉ౦టు౦ది?

  • మన అ౦తర్జాతీయ సహోదరత్వ౦లో మీకు నచ్చే విషయాలు ఏమిటి?

  • క్రైస్తవులుగా మన౦ ఐక్య౦గా ఉ౦డడ౦ వల్ల యెహోవాకు ఎలా మహిమ తెస్తా౦?