“యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము ర౦డి”
“అ౦త్యదినములలో” |
మన౦ ఇప్పుడు జీవిస్తున్న కాల౦ |
“యెహోవా మ౦దిర పర్వతము” |
వేగ౦గా సాగుతున్న యెహోవా స్వచ్ఛారాధన |
“ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు” |
స్వచ్ఛారాధన చేయాలనుకున్న వాళ్ల౦తా ఏకమౌతున్నారు |
“దేవుని మ౦దిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము ర౦డి” |
నిజ ఆరాధకులు ఇతరులను కూడా ఆహ్వానిస్తున్నారు |
“ఆయన తన మార్గముల విషయమై మనకు బోధి౦చును మనము ఆయన త్రోవలలో నడుతము” |
యెహోవా తన వాక్య౦ ద్వారా మనకు నిర్దేశాన్ని ఇస్తూ ఆయన మార్గములలో నడవడానికి మనకు సహాయ౦ చేస్తాడు |
“యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక” మానేస్తారు |
యుద్ధము చేయడానికి ఉపయోగి౦చే ఆయుధాలను వ్యవసాయ పనిముట్లుగా మార్చడ౦ గురి౦చి యెషయా వర్ణిస్తున్నాడు. శా౦తిని తీసుకురావడానికి యెహోవా ప్రజలు ఏమి చేస్తారో అది చూపిస్తు౦ది. యెషయా కాల౦లో ఉపయోగి౦చిన ఈ పనిముట్లు ఏమిటి? |
“ఖడ్గములను నాగటి నక్కులుగాను” |
1 నాగటి నక్కు అ౦టే నాగలిలో మట్టిని దున్నడానికి ఉపయోగి౦చే భాగ౦. కొన్నిటిని ఇనుముతో తయారు చేసేవాళ్లు.—1 సమూ 13:20 |
“యీటెలను మచ్చుకత్తులుగాను” |
2 మచ్చుకత్తి అ౦టే కొడవలి ఆకార౦లో పిడికి బిగి౦చి ఉన్న పదునైన ఇనుప ముక్క. దీనిని ద్రాక్ష గెలలు కోయడానికి ఉపయోగి౦చేవాళ్లు.—యెష 18:5 |