కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

తమను తాము ఆధ్యాత్మికంగా పోషించుకునేలా బైబిలు విద్యార్థులకు నేర్పించండి

తమను తాము ఆధ్యాత్మికంగా పోషించుకునేలా బైబిలు విద్యార్థులకు నేర్పించండి

బైబిలు విద్యార్థులు యెహోవా గురించి తెలుసుకోవడానికి, పరిణతిగల క్రైస్తవులుగా అవ్వడానికి మనం నేర్పించే సత్యాల కన్నా ఎక్కువే నేర్చుకోవాలి. (మత్త 5:3; హెబ్రీ 5:12–6:2) తమను తాము ఆధ్యాత్మికంగా ఎలా పోషించుకోవాలో కూడా వాళ్లు నేర్చుకోవాలి.

మొదట్లోనే, బైబిలు స్టడీకి ఎలా సిద్ధపడాలో మీ బైబిలు విద్యార్థికి చూపించి, అలా చేయమని ప్రోత్సహించండి. (mwb18.03 6) వ్యక్తిగత అధ్యయనం మొదలుపెట్టే ముందు ప్రతీసారి ప్రార్థించమని వాళ్లను ప్రోత్సహించండి. మన వెబ్‌సైట్‌ని ఎలా చూడాలో, యాప్‌లను ఎలా డౌన్‌లోడ్‌ చేయాలో, వాటిని ఎలా ఉపయోగించాలో చూపించండి. jw.orgలో, అలాగే JW బ్రాడ్‌కాస్టింగ్‌లో కొత్తగా వచ్చిన వాటిని ఎలా చూడాలో వివరించండి. రోజూ బైబిలు చదవడం, సంఘ కూటాలకు సిద్ధపడడం, తమ ప్రశ్నలకు జవాబుల్ని పరిశోధించడం మీ విద్యార్థులకు మెల్లమెల్లగా నేర్పించండి. నేర్చుకుంటున్న విషయాల గురించి ధ్యానించడానికి వాళ్లకు సహాయం చేయండి.

మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి—తమను తాము ఆధ్యాత్మికంగా పోషించుకునేలా వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • అధ్యయనం అంటే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం మాత్రమే కాదని అర్థంచేసుకోవడానికి జాస్మిన్‌కు నీతా ఎలా సహాయం చేసింది?

  • లైంగిక పాపానికి దూరంగా ఉండమని యెహోవా ఇచ్చిన ఆజ్ఞ సరైనదని అంగీకరించడానికి జాస్మిన్‌కు ఏది సహాయం చేసింది?

  • ప్రాముఖ్యమైన సమాచారాన్ని ఎలా నేర్చుకోవాలో, పాటించాలో మీ విద్యార్థులకు నేర్పించండి

    ధ్యానించడమంటే ఏంటని జాస్మిన్‌ అర్థంచేసుకుంది?