మన క్రైస్తవ జీవితం
మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు
థెస్సలొనీక సంఘం కష్టాలు ఎదుర్కొంటున్నా తోటి క్రైస్తవుల పట్ల ప్రేమ చూపించింది. (2 థెస్స 1:3, 4) నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీల పట్ల కూడా యెహోవా ప్రజలు అలాంటి ప్రేమనే చూపిస్తున్నారు. jw.orgలో ఉన్న “మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే . . . ” అనే ఆర్టికల్ సిరీస్, మీరిచ్చే విరాళాలు ఈ కష్టసమయాల్లో తోటి సహోదరులకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరిస్తాయి. మీరు చూపించే ప్రేమని, ఉదార స్ఫూర్తిని మేం మెచ్చుకుంటున్నాం.
మేము ‘మీ గురించి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్తాం’ వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
• మన విరాళాల్ని ఏ పనులకు ఉపయోగిస్తారో కొన్ని చెప్పండి.
• అవసరంలో ఉన్న మన సహోదరసహోదరీలకు ఆర్థిక మద్దతివ్వడానికి అన్నిటికన్నా మంచి మార్గం ఏంటి?