కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

ప్రార్థన ద్వారా యెహోవా సహాయాన్ని తీసుకోండి

ప్రార్థన ద్వారా యెహోవా సహాయాన్ని తీసుకోండి

ఒక వ్యక్తి హృదయంలో సత్యపు విత్తనం మొలకెత్తి పెరిగేలా చేసేది యెహోవాయే. (1కొ 3:6-9) కాబట్టి మన పరిచర్యలో మంచి ఫలితాలు సాధించాలంటే యెహోవా మీద ఆధారపడుతూ, మనకు అలాగే మన బైబిలు విద్యార్థులకు సహాయం చేయమని ఆయన్ని అడగాలి.

మీ విద్యార్థులు ఒత్తిళ్లను తట్టుకోవడానికి, అడ్డంకుల్ని అధిగమించడానికి యెహోవాను సహాయం చేయమని అడగండి. (ఫిలి 1:9, 10) ముఖ్యంగా ఏ విషయంలో వాళ్లకు సహాయం అవసరమో దాని గురించి ప్రార్థించండి. మీ ఆలోచనల ద్వారా, పనుల ద్వారా వాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు పవిత్రశక్తి నిర్దేశం కోసం ప్రార్థించండి. (లూకా 11:13) ఎలా ప్రార్థించాలో మీ బైబిలు విద్యార్థులకు నేర్పించండి, అలా చేయమని వాళ్లను ప్రోత్సహించండి. వాళ్ల పేరు ఉపయోగిస్తూ వాళ్లతో కలిసి, వాళ్ల కోసం ప్రార్థించండి.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—ప్రార్థన వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • జాస్మిన్‌కు స్టడీ చేస్తున్నప్పుడు నీతా ఎలాంటి సవాలును ఎదుర్కొంది?

  • 1 కొరింథీయులు 3:6, నీతాకు ఎలా సహాయం చేసింది?

  • నీతాకు ఎదురైన సవాలు ఎలా పరిష్కారమైంది?